https://oktelugu.com/

నాని చేయాల్సిన సినిమాలో యంగ్ హీరో !

సిద్ధూ జొన్నలగడ్డ…టాలెంట్ ఉన్నా.. పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయిన యంగ్ హీరో. నటనా జీవితాన్ని మొదలుపెట్టి.. దశాబ్దం దాటుతున్నా, హీరోగా మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. కానీ, ఇటీవలే “కృష్ణ అండ్ హిస్ లీల” చిత్రంతో మనోడి టైం మొదలైనట్లు ఉంది. ఆ సినిమాకి అద్భుతమైన టాక్ ఏమి రాకపోయినా సిద్ధూకి మాత్రం వరుస సినిమాలు వస్తున్నాయి. “కృష్ణ అండ్ హిస్ లీల”తో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరోకి ఇప్పుడు ఓ భారీ సంస్థ పిలిచి […]

Written By:
  • admin
  • , Updated On : October 9, 2020 / 05:39 PM IST
    Follow us on


    సిద్ధూ జొన్నలగడ్డ…టాలెంట్ ఉన్నా.. పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయిన యంగ్ హీరో. నటనా జీవితాన్ని మొదలుపెట్టి.. దశాబ్దం దాటుతున్నా, హీరోగా మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. కానీ, ఇటీవలే “కృష్ణ అండ్ హిస్ లీల” చిత్రంతో మనోడి టైం మొదలైనట్లు ఉంది. ఆ సినిమాకి అద్భుతమైన టాక్ ఏమి రాకపోయినా సిద్ధూకి మాత్రం వరుస సినిమాలు వస్తున్నాయి. “కృష్ణ అండ్ హిస్ లీల”తో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరోకి ఇప్పుడు ఓ భారీ సంస్థ పిలిచి మరీ సినిమా ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఈ యువ నటుడికి గతంలో ఎప్పుడూ ఇలాంటి పెద్ద అవకాశం రాలేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ క్రేజీ సినిమా చేయబోతున్నాడు.

    Also Read: దడపుట్టించిన ‘లక్ష్మీబాంబ్’ ట్రైలర్.. అదరగొట్టిన అక్షయ్..!

    కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. నూతన దర్శకుడు విమల్ కృష్ణ ఈ చిత్రాన్ని క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నాడట. విమల్ కృష్ణకి గతంలోనే నాని సినిమా ఛాన్స్ ఇచ్చాడని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు అని.. ఇన్నాళ్లు తరువాత సిద్ధూ హీరోగా ఈ సినిమా ఇప్పుడు మొదలవుతుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి “నరుడి బ్రతుకు నటన” అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టడం మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. పైగా ఇంతకుముందే సిద్ధూతో హీరోయిన్ గా చేసిన శ్రద్దా శ్రీనాథ్ నే మరోసారి సిద్ధూతో ఈ సినిమాలో కలిసి నటించబోతుంది. మొత్తానికి ఈ చిత్రం పేరు, లోగో సినిమా పై ఉత్సుకతను పెంచుతున్నాయి.

    Also Read: ఆర్జీవీ ‘మిస్సింగ్’ గోడు ఎవరికీ పట్టడం లేదా?

    ఇక చిత్రబృందం వదిలిన ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతం ప్రధానాంశంగా ఈ సినిమా నేపథ్యం సాగుతున్నట్లు అనిపిస్తుంది. మేకర్స్ పోస్టర్ లో హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో ఓ జంట లోకాన్ని మైమరచి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉండటం ఆసక్తిని పెంచింది. సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది కానీ ఈ పోస్టర్ లో మాత్రం బ్లూ కలర్ లో పెట్టారు. అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. యంగ్ టాలెంట్ కాల భైరవ సంగీతం అందిస్తుండగా సూర్య దేవర నాగవంశీ నిర్మాణం వహిస్తున్నారు. ఈ దీపావళి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడు విమల్ కృష్ణతో పాటు హీరో సిద్ధూ కూడా రచయితగా పని చేస్తున్నాడు.