https://oktelugu.com/

హీరో విశాల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు..?

మద్రాస్ హైకోర్టు హీరో విశాల్ కు భారీ షాక్ ఇచ్చింది. విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ సినిమా విషయంలో తీర్పును వెలువరించింది. విశాల్ యాక్షన్ సినిమా నిర్మాతలకు 8.29 కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇవ్వాలని పేర్కొంది. హైకోర్టు విశాల్ కు ఇలాంటి షాక్ ఇవ్వడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో మాస్ సినిమాలతో హీరో విశాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 2019లో విశాల్ హీరోగా తమన్నా హీరోయిన్ గా ట్రైడెంట్ ఆర్ట్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 9, 2020 / 05:19 PM IST
    Follow us on

    మద్రాస్ హైకోర్టు హీరో విశాల్ కు భారీ షాక్ ఇచ్చింది. విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ సినిమా విషయంలో తీర్పును వెలువరించింది. విశాల్ యాక్షన్ సినిమా నిర్మాతలకు 8.29 కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇవ్వాలని పేర్కొంది. హైకోర్టు విశాల్ కు ఇలాంటి షాక్ ఇవ్వడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో మాస్ సినిమాలతో హీరో విశాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

    2019లో విశాల్ హీరోగా తమన్నా హీరోయిన్ గా ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ సుందర్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా తెరకెక్కింది. విశాల్ ఈ సినిమాను భారీగా నిర్మించాలని కలెక్షన్లు 20 కోట్లు క్రాస్ చేయకపోతే నష్టాన్ని తాను భరిస్తానని సినిమా నిర్మాణం సమయంలో నిర్మాతలకు మాట ఇచ్చాడు. హీరో హామీ ఇవ్వడంతో నిర్మాతలు భారీతనంతో సినిమాను నిర్మించారు. అయితే ఊహించని విధంగా సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుతుంది.

    యాక్షన్ సినిమాకు తమిళనాడులో 7.7 కోట్ల రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి. దీంతో నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చాయి. ఆ తరువాత ఇచ్చిన మాట ప్రకారం నష్టాన్ని భరించాలని నిర్మాతలు విశాల్ ను కోరగా విశాల్ అందుకు అంగీకరించలేదు. కావాలంటే అదే బ్యానర్ పై మరో సినిమాలో నటిస్తానని చెప్పాడు. అయితే విశాల్ ఆ సినిమాను ట్రైడెంట్ బ్యానర్ పై కాకుండా సొంతంగా నిర్మించాలని భావించాడు.

    దీంతో ఏం చేయాలో పాలుపోని నిర్మాతలు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు విశాల్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో విశాల్ ఆ బ్యానర్ లో నిర్మించే సినిమాలో నటించడం లేదా డబ్బులు తిరిగివ్వడం చేయాల్సి ఉంటుంది.