Homeఎంటర్టైన్మెంట్Siddhu Jonnalagadda Meenakshi Chaudhary: వెబ్ సిరీస్ లో నటించబోతున్న సిద్దు జొన్నలగడ్డ , మీనాక్షి...

Siddhu Jonnalagadda Meenakshi Chaudhary: వెబ్ సిరీస్ లో నటించబోతున్న సిద్దు జొన్నలగడ్డ , మీనాక్షి చౌదరి.. డైరెక్టర్ ఎవరంటే..

Siddhu Jonnalagadda Meenakshi Chaudhary: కేవలం రెండు మూడు సినిమాలతోనే యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోల్లో ఒకరు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన , ఆ తర్వాత హీరో గా రెండు మూడు సినిమాల్లో నటించాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లు చిత్రం మాత్రం సిద్దు జొన్నలగడ్డ కెరీర్ మొత్తాన్ని ఒక మలుపు తిప్పింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ కూడా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. కానీ ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాలు కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతున్నాడు.

ప్రఖ్యాత నెట్ ఫ్లిక్స్ సంస్థ సిద్దు జొన్నలగడ్డ తో ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ చేయబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపిక అయ్యినట్టు సమాచారం. అదే విధంగా ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు అట. మంచి కాంబినేషన్ కుదిరింది. కానీ ఇదే వెంకీ అట్లూరి సిద్దు జొన్నలగడ్డ తో ఒక సినిమా చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే సిద్దు ప్రస్తుతం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు , ఆయన భవిష్యత్తు కెరీర్ ఏంటో కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇలాంటి సమయం లో వెంకీ అట్లూరి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తే బాగుంటుంది అనేది విశ్లేషకుల వాదన. కానీ వెబ్ సిరీస్ చేయడం వల్ల , చాలా అడ్వాంటేజ్ లు ఉంటాయి.

ఒకవేళ వెబ్ సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే , అన్ని దేశాలకు , అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు ఎగబడి చూస్తారు. ఆ కారణంగా సిద్దు కి మంచి రీచ్ వస్తుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి , ప్రియాంక చోప్రా , సమంత వంటి వారు కూడా వెబ్ సిరీస్ ద్వారానే పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ ని సంపాదించారు. ఇప్పుడు సిద్దు కి కూడా ఆ అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థ వెంకీ అట్లూరి ని ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ‘లక్కీ భాస్కర్’ చిత్రమే. ఈ సినిమాకు దాదాపుగా 30 మిల్లియన్లకు పైగా వ్యూస్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చాయి. టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ ని సాధించిన చిత్రం గా చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ వెంకీ అట్లూరి ని ఎంచుకుంది , త్వరలోనే ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుంది

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version