Homeఎంటర్టైన్మెంట్Kalki 2 interval scene: 'కల్కి 2' ఇంటర్వెల్ కోసం భారీ సెట్స్.. నాగ్ అశ్విన్...

Kalki 2 interval scene: ‘కల్కి 2’ ఇంటర్వెల్ కోసం భారీ సెట్స్.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..

Kalki 2 interval scene: మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విజువల్ వండర్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD'(Kalki 2898 AD) చిత్రం కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని థియేటర్ లో కూర్చొని చూస్తున్నంత సేపు ఒక సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది. విజువల్ వండర్స్ ని కేవలం రాజమౌళి తప్ప, ఇంకెవ్వరు పర్ఫెక్ట్ గా తెరకెక్కించలేరు అని అంతా అనుకునేవారు. కానీ కేవలం రెండు సినిమాల అనుభవం తో నాగ్ అశ్విన్(Nag Ashwin) సృష్టించిన ఈ సరికొత్త ప్రపంచాన్ని , అందులోని విజువల్స్ ని చూసి విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈమధ్య కాలం లో అవసరం లేని సినిమాలకు సీక్వెల్స్ ని ప్రకటించడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ee సినిమాకు సీక్వెల్ కచ్చితంగా అవసరం అనిపించేలా క్లైమాక్స్ ని డిజైన్ చేశాడు నాగ్ అశ్విన్.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ని మొదలు పెట్టారు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachan) , కమల్ హాసన్(Kamal Hassan) లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఇంటర్వెల్ కి సంబంధించిన షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. అందుకోసం భారీ సెట్స్ ని కూడా ఏర్పాటు చేశాడు . వచ్చే నెలలో ఈ ఇంటర్వెల్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది. ప్రభాస్(Rebel Star Prabhas) తో పాటుగా అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ వంటి వారు కూడా ఈ ఇంటర్వెల్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుందట. ప్రభాస్ అభిమానులు అయితే జీవితాంతం ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ ని గుర్తు పెట్టుకుంటారట. ఆ రేంజ్ లో ప్లానింగ్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్.

ఇకపోతే ఈ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం తో ఆమె స్థానం లోకి సాయి పల్లవి వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు , ఈ సినిమాలో మహాభారతం లోని కొన్ని క్యారెక్టర్స్ కూడా అదనంగా చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి భాగం లో చాలా మంది ప్రభాస్ క్యారక్టర్ కంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనే ఫీలింగ్ ఉండేది. కానీ రెండవ భాగం లో ప్రభాస్ విశ్వరూపం చూస్తారని అంటున్నారు. అదే విధంగా కమల్ హాసన్ క్యారెక్టర్ ని కూడా ఇందులో పూర్తి స్థాయి లో చూడొచ్చు. ఈ సినిమాలో ఆయన క్యారక్టర్ ప్రభాస్ కంటే పవర్ ఫుల్ గా ఉండబోతుందని టాక్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version