Homeఎంటర్టైన్మెంట్Young heroine as villain in Chiranjeevi movie: చిరంజీవి చిత్రంలో విలన్ గా నటించబోతున్న...

Young heroine as villain in Chiranjeevi movie: చిరంజీవి చిత్రంలో విలన్ గా నటించబోతున్న యంగ్ హీరోయిన్..బంపర్ ఛాన్స్ కొట్టేసిందిగా..

Young heroine as villain in Chiranjeevi movie: ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), బాబీ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. KVN ప్రొడక్షన్స్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల, ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం అతి త్వరలోనే జరగబోతుంది. వచ్చే నెల మొదటి వారం లో లాంఛనంగా ఈ సినిమా మొదలు కానుంది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 న లాంచ్ చేయాలనీ అనుకున్నప్పుడు , డైరెక్టర్ బాబీ మరియు నిర్మాత లోహిత్ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి ఆహ్వానించారు. మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని పిలుస్తారా లేదా అనేది చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్ ని ఫైనల్ చేస్తున్నాడు డైరెక్టర్ బాబీ.

ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి ఓల్డ్ ఏజ్ గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు జోడీగా ప్రియమణి ని ఎంచుకున్నారు. ఇక వీళ్లిద్దరికీ కూతురుగా ‘ఛాంపియన్’ మూవీ ఫేమ్ అనశ్వర రాజన్ ని ఎంచుకున్నారు. ఇది ఇలా ఉండగా , ఈ చిత్రం లో ఒక పవర్ ఫుల్ లేడీ విలన్ క్యారెక్టర్ కూడా ఉంటుందట. ఆ క్యారెక్టర్ కోసం డింపుల్ హయతి ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈమె తెలుగు, తమిళం మరియు ఇతర భాషలకు కలిపి 11 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లో ఈమె హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇది కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇలాంటి సమయం లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ దొరకడం డింపుల్ హయతి అదృష్టం అనే చెప్పాలి.

ఇందులో ఆమె చేస్తున్నది విలన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా , క్లిక్ అయితే ఆమె రేంజ్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆమె కెరీర్ కూడా పెద్ద రేంజ్ కి వెళ్లొచ్చు , చూడాలి మరి ఈ సినిమా ఆమెకు ఎంత ఉపయోగపడుతుంది అనేది. ఇక ఈ చిత్రం లో కీలక పాత్ర కోసం మోహన్ లాల్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. కానీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ రావడం తో ఆయన డేట్స్ ఇప్పుడు సర్దుబాటు కావడం లేదట. అందుకే మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అనిల్ కపూర్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధిసీమ్హిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version