Hero Siddarth: అసలు జవాబుదారీతనం ఎక్కడుంది?.. కేంద్రంపై హీరో సిద్ధార్థ్​ ఫైర్​

Hero Siddarth: తెలుగు సినీ పరిశ్రమలో సొంతంగా నిలదొక్కుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్​. బాయ్స్​ సినిమాలో హీరోగా పరిచయమై ఆ తర్వాత వరుసగా విభన్న కథాంశాలతో పలకరించి.. ప్రేక్షకాభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్​లోనూ సినిమాలు చేస్తూ.. రెండు ప్రాంతాల్లో మంచి క్రేజ్​ ఉన్న హీరోగా గుర్తింపు పొందారు. మధ్యలో ఫామ్​ కోల్పోయినా.. మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు సినీ పరిశ్రతో పాటు దేశంలో జరిగే వివిధ సంఘటనలపై తనదైన […]

Written By: Raghava Rao Gara, Updated On : December 7, 2021 2:43 pm
Follow us on

Hero Siddarth: తెలుగు సినీ పరిశ్రమలో సొంతంగా నిలదొక్కుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్​. బాయ్స్​ సినిమాలో హీరోగా పరిచయమై ఆ తర్వాత వరుసగా విభన్న కథాంశాలతో పలకరించి.. ప్రేక్షకాభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్​లోనూ సినిమాలు చేస్తూ.. రెండు ప్రాంతాల్లో మంచి క్రేజ్​ ఉన్న హీరోగా గుర్తింపు పొందారు. మధ్యలో ఫామ్​ కోల్పోయినా.. మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు సినీ పరిశ్రతో పాటు దేశంలో జరిగే వివిధ సంఘటనలపై తనదైన శైలిలో ప్రశ్నిస్తూ.. నిరంతరం హాట్​టాపిక్​గా ఉంటారు. ఈ క్రమంలో తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా అసలు పట్టించుకోకుండా.. తన దారి తాను చూసుకుంటారు.

ఇటీవలే సినిమా టికెట్​ ధరలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు సిద్ధార్థ్​. తాజాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన స్టైల్​లో విరుచుకుపడ్డారు. ఇటీవలే నాగలాండ్​లో జరిగిన ఘటనపై సిద్ధార్థ్​ మండిప్డారు. నాగాలాండ్‏లోని మయన్మార్ సరిహద్దు మోన్ జిల్లాలో భద్రతా బలగాలు శనివారం జరిపిన కాల్పులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సామన్య పౌరులను ఉగ్రవాదులనుకొని ఈ కాల్పులు జరపడం ప్రస్తుతం దేశమంతటా కలకలం సృష్టించింది. దీంతో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రతిదాడిగా అక్కడి స్థానికులు బలగాలపై మూకుమ్మడి దాడి చేశారు.

ఈ విషయంపై స్పందించిన సిద్ధార్థ్​.. భద్రతా బలగారు జరిపిన కాల్పుల్లో అమాయకులు బలయ్యారని అన్నారు. తమిళనాడులోనూ ఇంకో కస్టోడియల్ డెత్​ జరిగిందని కోప్పడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్టూడెంట్​ను కూడా బలితీసుకున్నారని మండిపడ్డారు. అసలు జవాబూదారీతనం ఎక్కడుందని ప్రశ్నించారు. కాపాడాల్సిన వారే శిక్షిస్తుంటే ఇంకెలా బ్రతకడం అంటూ విరుచుకుపడ్డారు.