Actor Nani: శ్యామ్​సింగరాయ్​ టీజర్​పై సర్వత్రా ఆసక్తి.. రేపే రిలీజ్​!

Actor Nani: నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​సింగరాయ్​. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిహారిక ఎంటర్​టైన్మెంట్​ పతాకంపై వెంకట్​ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికేే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​లు, వీడియోలు విడుదలై సినిమాపై భారీ అంచనాలు క్రియేట్​ చేశాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్​డేట్​ వచ్చింది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్​ను ముమ్మరం చేసింది చిత్ర బృందం. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 17, 2021 4:05 pm
Follow us on

Actor Nani: నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​సింగరాయ్​. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిహారిక ఎంటర్​టైన్మెంట్​ పతాకంపై వెంకట్​ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికేే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​లు, వీడియోలు విడుదలై సినిమాపై భారీ అంచనాలు క్రియేట్​ చేశాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్​డేట్​ వచ్చింది.

వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్​ను ముమ్మరం చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే టీజర్​ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. నాని కెరీర్​లో భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్​ ఎలా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్​ను నవంబరు 18న విడుదల చేయనున్నారు. మరోవైపు,  నాని ఓ సరికొత్త ఫొటోను సోషల్​ మీడియా వేదికగా షేర్​ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్​గా మారింది.

కాలుమీద కాలు వేసుకుని.. ఆగమని ఆజ్ఞాపిస్తూ.. ఉన్న నాని ఫొటో సూపర్​గా ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 24 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  కాగా, చాలా కాలంగా సాలిడ్​ హిట్​కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ సినిమా బ్రేక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.