https://oktelugu.com/

ChanaKya Nithi: మూర్ఖులతో వాదిస్తున్నారా.. అయితే మీ సమయం వృధా.. ఎందుకంటే?

ChanaKya Nithi: ఆచార్య చాణక్యుడు నీతి సూత్రాల గురించి అందరికీ తెలిసిందే. ఈయన హితబోధలు వినడానికి పాటించడానికి నేటి తరం వారికి కొంత కష్టతరంగా ఉంటుంది. కానీ నిశ్చింతగా ఆలోచిస్తే అందులో ఎంతో సత్యం దాగి ఉంటుంది. ఈ విధంగా ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంథంలో మూర్ఖుల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ నీతి గ్రంథంలో ఎల్లప్పుడూ కూడా మూర్ఖులతో ఎవరు వాదనకు దిగకూడదని తెలిపారు. Also Read: శ్రీశైల భ్రమరాంబికకు.. చత్రపతి శివాజీకి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 2, 2021 3:29 pm
    chankya-neethi
    Follow us on

    ChanaKya Nithi: ఆచార్య చాణక్యుడు నీతి సూత్రాల గురించి అందరికీ తెలిసిందే. ఈయన హితబోధలు వినడానికి పాటించడానికి నేటి తరం వారికి కొంత కష్టతరంగా ఉంటుంది. కానీ నిశ్చింతగా ఆలోచిస్తే అందులో ఎంతో సత్యం దాగి ఉంటుంది. ఈ విధంగా ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంథంలో మూర్ఖుల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ నీతి గ్రంథంలో ఎల్లప్పుడూ కూడా మూర్ఖులతో ఎవరు వాదనకు దిగకూడదని తెలిపారు.

    ChanaKya Nithi

    ChanaKya Nithi

    Also Read: శ్రీశైల భ్రమరాంబికకు.. చత్రపతి శివాజీకి మధ్య ఉన్న అనుబంధం గురించి మీకు తెలుసా?

    మూర్ఖులతో ఏ విషయం గురించైనా వాదనకు దిగిన మన సమయం వృధా అవుతుందే తప్ప మనకు కానీ లేదా వారికి కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని వెల్లడించారు. మనకు ఈ విధమైనటువంటి వ్యక్తులు ఎదురుపడినప్పుడు వారితో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి మూర్ఖులు మనం చెప్పే ఏ విషయాన్ని కూడా సరిగా అర్థం చేసుకోక పోవడమేకాకుండా వారి ధోరణిలో వారికి అది తప్పుగా అనిపిస్తుంది.

    ఈ విధంగా కొన్ని విషయాలలో మూర్ఖులను ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చివరికి ఆ ప్రయత్నాలు వృధాగా మారిపోతుంటాయి.మూర్ఖులు ఎల్లప్పుడు వారు మాట్లాడటం వారి చెప్పే వ్యాఖ్యలు నిజమేనని ఇతరులు చెప్పే వాటిపై అవగాహన లేకపోవటం వల్ల తమ వాదనను వారు సమర్థించుకుంటారు. ఇలాంటి మూర్ఖులకు మీరు ఏ విషయం గురించి అయినా వివరించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ సమయం వృధా చేసుకోవడమే అని అలాంటి మూర్ఖులతో ఎప్పుడూ కూడా వాదనకు దిగ కూడదని ఆచార్య చాణిక్యుడు నీతి గ్రంథంలో మూర్ఖుల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు.

    Also Read: సీనియర్ సిటిజన్లకు సూపర్ ఆఫర్.. రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షలు!