బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లో చాలా సినిమాలు విడుదల వాయిదాపడి ఆగి పోయాయి. ఎప్పుడు విడుదల అవుతాయో తెలీదు .ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి. కనీసం ఇంకో వారం ఆగితేనే గాని తరవాత పరిస్థితులు తెలీవు. ఇలా మూడు వారాలు బిజినెస్ లేకపోవడంతో మిగతా పరిశ్రమలు అయితే లాక్ డౌన్ పీరియడ్ ముగిస్తే డిమాండ్ అండ్ సప్లై ఫార్ములాతో కోలుకునే వీలుంది, కానీ సినీ ఇండస్ట్రీ మాత్రం అలా కాదు. సీజన్ బట్టి వసూళ్లు ఉంటాయి. పండుగలు అప్పుడు ఒక స్థాయిలో ఉంటాయి ఇక సమ్మర్ సీజన్ లో ఇంకోలా ఉంటాయి . ఆ లెక్కన సమ్మర్ సీజన్ అంతా ప్రేక్షకులకు దూరంగా థియేటర్ లు ఉంటే వచ్చే నష్టాలను ఊహించలేం Nature is unseen enemy .