చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ప్రస్తుతం భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా 446కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తెలంగాణలో 36కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి తెలంగాణ, ఏపీ సీఎంలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది.
లాక్ డౌన్ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ పై భారం పడింది. దీంతో పలువురు దాతలు ముందుకొచ్చి విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హీరో నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాలకు 10లక్షల చొప్పుల విరాళం అందజేయనున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి సీఎం సహాయనిధికి 10లక్షల రూపాయలను అందజేశారు.
అదేవిధంగా ప్రముఖ పెట్రోలియం సంస్థ రిలయన్స్ కరోనా బాధితులకు ఉపయోగించే వాహనాలకు ఉచితంగా ఇంధనాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్ ఆలీబాబా సంస్థ అధినేత కూడా సహాయం ప్రకటించారు. సినీ హీరో రాజశేఖర్ సీనీ కార్మికులకు సరుకులు అందజేనున్నట్లు ప్రకటించారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి తమిళ సీని కార్మికుల కోసం 50లక్షల విరాళాలను ప్రకటించారు. అదేవిధంగా హీరో కార్తీ, సూర్యలు 10లక్షల విరాళాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. మరికొంత మంది విరాళాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.