YCP: ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికీ ప్రతిపక్ష టీడీపీ పొత్తులు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పొత్తుల వ్యవహారం అటు టీడీపీ, బీజేపీలో కంటే కూడా వైసీపీలోనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. నిన్న అమరావతి న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా అన్ని పార్టీలు కలిశాయి.
పార్టీలకు అతీతంగా వైసీపీ మినహా అందరూ విచ్చేసి రైతులకు మద్దతు తెలిపారు. అయితే ఈ సభా వేదిక మీద చంద్రబాబు నాయుడు స్వయంగా కన్నా లక్ష్మినారాయణను తన వద్దకు పిలుచుకుని మరీ మాట్లాడారని, ఆ రెండు పార్టీలు పొత్తుల కోసమే దాన్ని వాడుకున్నారని వైసీపీ నేతలే ప్రచారం మొదలు పెట్టారు. అంటే పొత్తుల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చి రైతుల పోరాటానికి ఉన్న ప్రాముఖ్యతను తగ్గించాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నిజానికి పొత్తుల విషయం ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగి దారుణంగా దెబ్బ తిన్నది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పొత్తులు పెట్టుకుని జగన్ పార్టీని ఓడించాలని పంతం మీద ఉంది. కానీ ఆల్రెడీ బీజేపీ, జనసేన పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ టీడీపీని దగ్గరకు రానిచ్చే పరిస్థితులు లేవని ఇప్పటికే మోడీ, అమిత్ షా సంకేతాలు కూడా ఇచ్చేశారు.
Also Read: Three Airports: ప్రైవేటీకరణ మంత్రం.. ఏపీలో మూడు విమానాశ్రయాలపై కన్ను
కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్లు ఉన్నాయి. కాబట్టి ఈ లోపు బీజేపీకి ఇతర రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితులు ఎదురైతే టీడీపీతో పొత్తులు పెట్టుకునే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పుడు వైసీపీకి అండగా ఉంటున్న ఓ బలమైన వర్గం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడితే వీరికే సపోర్టు చేసేందుకు రెడీగా ఉందంట. అదే గనక జరిగితే రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఇబ్బందులు తప్పవు.
Also Read: Pawan Kalyan: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ‘తెలంగాణ మోడల్’ సిద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్?