Shruti Haasan: శృతి హాసన్ అంటేనే బోల్డ్.. మొహమాటం అనేది తనకు నచ్చదు అని అంటూ ఉంటుంది. అది ఎంత బోల్డ్ వ్యవహారం అయినా సరే.. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం శృతి హాసన్ కి బాగా అలవాటు. ఈ క్రమంలోనే గతంలో ఓ జర్నలిస్ట్ పెళ్లి గురించి ఆమె దగ్గర ప్రస్తావించాడు. మీ పెళ్ళి ఎప్పుడు అని ?, ‘డేటింగ్ పై ఇంట్రెస్ట్ ఉంది గానీ, పెళ్లి పై లేదు. అందుకే, ఎవరితో రిలేషన్ లో ఉన్నా పెళ్లి మాత్రం చేసుకోను’ అంటూ పచ్చిగా మాట్లాడి సదరు జర్నలిస్ట్ కే షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం 35 ఏళ్ల శృతి హాసన్ ‘శాంతను హజారికా’ అనే ఆర్టిస్ట్ తో సహజీవనం చేస్తూ.. అతనితో పీకల్లోతు రొమాన్స్ లో మునిగిపోయింది. అయితే, మీడియా మాత్రం శృతి హాసన్ పెళ్లి పై ఆసక్తిని చంపుకోవడం లేదు. ఆమె ఎప్పుడూ కనిపించినా.. మీరు ‘శాంతను హజారికా’ను పెళ్లి చేసుకుంటారా ? అంటూ శృతి పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
దీనికితోడు సోషల్ మీడియాలో అభిమానులు కూడా ‘శాంతను హజారికా’ తో మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు ?’ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దాంతో ఆ ప్రశ్నలకు విసుగెత్తిపోయిన ఈ స్టార్ బోల్డ్ బ్యూటీ కోపంతో గయ్యిమని ఎగురుతుంది. తాజాగా శృతి హాసన్ ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ లో.. ‘మీ పెళ్లి ఎప్పుడు ? అని ఒక తమిళ అభిమాని అడిగిన ప్రశ్నకు శృతి కోపాన్ని అణుచుకుంటూ అతనికి సమాధానం ఇచ్చింది.
‘ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. నా పెళ్లి గురించి ఊహే వద్దు’ అని ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. ఏది ఏమైనా శృతి హాసన్ కి డేటింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ పెళ్లి మీద లేకపాయే. ఎంత సేపూ బాయ్ ఫ్రెండ్స్ తో సహజీవనం తప్పితే.. పెళ్లి అంటేనే మనసు పోవడం లేదు అంటుంది.
శృతి హాసన్ రీసెంట్ గా ముంబైలో సొంత ఇల్లు కొనుక్కొంది. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ‘శాంతను హజారికా’తో కలిసి ఉంటుంది. అంతకు ముందు ఒక విదేశీయుడితో కూడా కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలింది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ ‘సలార్’ సినిమాలో నటిస్తోంది.