https://oktelugu.com/

Dacoit Movie: సగం షూటింగ్ పూర్తి చేసుకున్న అడవి శేష్ ‘డెకాయిట్’ మూవీ నుండి తప్పుకున్న శృతి హాసన్..కారణాలు ఇవే!

అడవి శేష్ మార్క్ కనపడుతూ సరికొత్తగా ఆ గ్లిమ్స్ వీడియో అనిపించింది. అయితే ఈ సినిమా నుండి శృతి హాసన్ తప్పుకున్నట్టుగా గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి. ఇదే విషయాన్ని శృతి హాసన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడగగా, అవును నిజమే అని చెప్పుకొచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 15, 2024 / 04:04 PM IST

    Dacoit Movie

    Follow us on

    Dacoit Movie: క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలుపెట్టిన అడవిశేష్, ఆ తర్వాత హీరోగా మారి విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మార్కెట్ లో అడవి శేష్ సినిమా అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆయన నుండి కొత్త సినిమా వస్తుందంటే కచ్చితంగా థియేటర్ లో చూడాలి అని ఒక సెక్షన్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. హీరోగా ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆయన గత చిత్రం ‘హిట్ : ది సెకండ్ కేస్’ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ‘గూఢచారి 2’, ‘డెకాయిట్’ వంటి సినిమాలు చేస్తున్నాడు. ‘డెకాయిట్’ చిత్రం లో శృతి హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కూడా విడుదల చేసారు మేకర్స్.

    అడవి శేష్ మార్క్ కనపడుతూ సరికొత్తగా ఆ గ్లిమ్స్ వీడియో అనిపించింది. అయితే ఈ సినిమా నుండి శృతి హాసన్ తప్పుకున్నట్టుగా గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి. ఇదే విషయాన్ని శృతి హాసన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడగగా, అవును నిజమే అని చెప్పుకొచ్చింది. షెడ్యూల్స్ విషయం లో గందరగోళంగా ఆ చిత్రం మేకర్స్ ఉండడం వల్లే, తనకు వర్కౌట్ అవ్వక తప్పుకున్నానని చెప్పుకొచ్చింది శృతి హాసన్. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. అందులో శృతి హాసన్ సన్నివేశాలు చాలా వరకు షూట్ చేసారు. ఇప్పుడు ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ ని తీసుకొని, ఆ సన్నివేశాలను రీ షూట్ చేయాలి. నిర్మాతకు రెమ్యూనరేషన్ ఖర్చు తో పాటు, బడ్జెట్ కూడా డబుల్ అయ్యి భారీ నష్టాలను షూటింగ్ దశలోనే తెచ్చిపెట్టింది ఈ చిత్రం.

    అయితే ఇప్పుడు శృతి హాసన్ స్థానం లో ఎవరు వస్తారు అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమన్నా డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారట. కానీ ఆమె రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తమన్నా తో పాటుగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, తాప్సి వంటి హీరోయిన్స్ ని కూడా సంప్రదిస్తున్నారట. వీళ్ళెవరూ కుదరకపోతే, రెజీనా కాసాండ్రా ని తీసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. గతం లో అడవి శేష్, రెజీనా కాంబినేషన్ లో ‘ఎవరు’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. ఈమెతో అడవి శేష్ రిలేషన్ లో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘గూఢచారి’ అనే చిత్రం వచ్చింది.