https://oktelugu.com/

Rajinikanth & Suriya : రజినీకాంత్ వల్ల భారీగా నష్టపోయిన సూర్య…కారణం ఏంటంటే..

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వైవిధ్యభరితమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్లు చేసే సినిమాల ద్వారానే వాళ్లకు చాలా మంచి గుర్తింపైతే వస్తుంది. కాబట్టి సినిమా చేయడం ఒకెత్తైతే దానిని సరైన సమయంలో రిలీజ్ చేసుకోవడం మరొక ఎత్తనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 15, 2024 / 04:06 PM IST

    Rajinikanth's huge loss to Surya...what is the reason..?

    Follow us on

    Rajinikanth & Suriya : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో సూర్య… ప్రస్తుతం ఆయన వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు గా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఆయన శివ డైరెక్షన్ లో చేసిన కంగువా సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మొదట ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినిమా మేకర్స్ భావించారు. కానీ వేట్టయన్ సినిమాతో రజినీకాంత్ బరిలో దిగుతున్నాడని తెలిసిన సూర్య అండ్ టీం తమ సినిమాను దీపావళికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక నిజానికైతే దసరాకి రిలీజ్ అయిన వేట్టయన్ సినిమా ప్రేక్షకుల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. దాంతో పాటుగా తెలుగులో రిలీజ్ అయిన మరికొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. నిజానికి కంగువా సినిమా దసరా కానుకగా వస్తే భారీ కలెక్షన్స్ ని సాధించేది. కానీ ఇప్పుడు దీపావళి కానుకగా ప్రేక్షకుడి ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సూర్యను రజనీకాంత్ పెద్ద దెబ్బ కొట్టడనే చెప్పాలి.
    ఎందుకంటే వేట్టయన్ సినిమాని అనౌన్స్ చేసిన వెంటనే సూర్య తన కంగువా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. నిజానికి రజినీకాంత్ మీద సూర్యకి ఉన్న రెస్పెక్ట్ వల్లే ఆయన అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. కానీ రజనీకాంత్ మాత్రం ఆ విషయం మీద ఏ రకంగానూ స్పందించలేదు.
    ఇప్పుడు సూర్య అభిమానులు మాత్రం రజనీకాంత్ వల్లే తమ హీరోకి అన్యాయం జరిగిందని మా హీరో దసరా కి వచ్చుంటే ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసేదని మీ స్వార్థం కోసం మా హీరో భవిష్యత్తుని అన్యాయం చేస్తున్నారు అంటూ రజనీకాంత్ మీద సూర్య అభిమానులు కొంత మంది ఫైర్ అవుతున్నారు. నిజానికి రజనీకాంత్ కూడా కంగువా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోమని ఏమీ చెప్పలేదు. సూర్యనే తన సినిమాకి పోటీ ఉండకూడదని దసరా కి కాకుండా దీపావళికి వస్తానని అనౌన్స్ చేశాడు.
    అయినప్పటికీ సూర్య కూడా దసరాకి తన సినిమాని రిలీజ్ చేసుకొని ఉంటే బాగుండేదని మరి కొంతమంది సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దసరా సీజన్ ముగిసింది. కాబట్టి ఇక దీపావళికి ‘కంగువా’ సినిమాతో ఒక భారీ సక్సెస్ సాధించాలని సూర్య భావిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…