https://oktelugu.com/

Best Car: Innovaకు పోటీగా 7 సీటర్ కారు.. కానీ ధర మాత్రం చాలా తక్కువ.. ఆ కారేదో తెలుసుకోండి..

నేటి కాలంలో చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం సొంత కారు ఉండాలనుకుంటున్నారు. ఈ క్రమంలో రూ.10 లక్షల లోపు బడ్జెట్ కేటాయిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ లో 7 సీటర్ మోడల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సామాన్యులు సైతం కొనుగులో చేసేలా రెనాల్డ్ కంపెనీ ఓ మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 10, 2023 / 02:41 PM IST

    Best Car

    Follow us on

    Best Car: 7 సీటర్ కారు అనగానే ముందుగా టయోటా ఇన్నోవా గురించి మాట్లాడుతాం. దీనిని ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. కుటుంబ అవసరాలకు ఉపయోగపడదు. పైగా ఈ మోడల్ రూ.20 లక్షలకు తక్కువగా ఉండదు. అయితే ఇదే ఇన్నోవాకు పోటీగా.. అంతే ఫీచర్స్ ను కలిగి ఉండి 7 సీటర్ తో మారో కారు ఆకర్షిస్తోంది. అంతేకాకుండా కేవలం 10 లక్షలలోపే ఇంటికి తీసుకురావొచ్చు. ఇన్నోవా ఫీచర్స్ తో పోడీ పడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నా ఆ కారు గురించి వివరాల్లోకి వెళితే..

    నేటి కాలంలో చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం సొంత కారు ఉండాలనుకుంటున్నారు. ఈ క్రమంలో రూ.10 లక్షల లోపు బడ్జెట్ కేటాయిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ లో 7 సీటర్ మోడల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సామాన్యులు సైతం కొనుగులో చేసేలా రెనాల్డ్ కంపెనీ ఓ మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ట్రైబర్. ఈ మోడల్ లో లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు ప్రయాణికుల భద్రత కోసం అన్ని సౌకర్యాలు అమర్చారు.

    రెనాల్ట్ ట్రైబర్ 1 లీటర్ పెట్రోల్, 3 సిలిండర్ తో ఇంజిన్ ను కలిగి ఉంది. 72 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ను అమర్చారు. ఈ కారు లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 8 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోమెంట్ సిస్టమ్, డ్రైవర్ సీటు, స్టీరింగ్ – మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పాటు డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ క్లస్టర్, సాధారణ కీ కి బదులు స్మార్ట్ కార్డ్ యాక్సెస్ కీని పొందవచ్చు.

    ఈ మోడల్ ఇన్నర్ స్పేస్ విషయానికొస్తే ఎంపీవీ అప్డేట్ చేసిన ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇందులో 84 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. మూడు వరుసల సీట్లు కిందికి మలచడం ద్వారా 625 లీటర్ల స్పేస్ ను పొందవచ్చు. 7 గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లగలిగే దీని ధర రూ.6.3 లక్షల నుంచి ప్రారంభమై గరిష్టంగా 8.97 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇన్నోవా రేంజ్ లోనే ఉన్న ఈ కారు గురించి తెలిసిన వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.