https://oktelugu.com/

34 ఏళ్ల ‘శృతి హాసన్’.. ఆంటీ పాత్రలకే ఫిక్స్ !

సినిమా ఇండస్ట్రీలో ఒక అనవాయితీ ఉంది. ఒక స్టార్ హీరోయిన్ గనుక, ఒక పెద్ద సినిమాలో ఆసాంతం “భార్య” పాత్రలోనే నటించిందా ? ఇక ఆ హీరోయిన్ ఫేడ్ అవుట్ అయిపోయినట్టే. ఇక ఆమె “సీనియర్ హీరోయిన్ల” ఖాతాలో చేరినట్లే అనేది మన మేకర్స్ అభిప్రాయం. అప్పటి భానుమతి, సావిత్రి దగ్గర నుండి నిన్నటి శ్రీయా, ప్రియమణి వరకూ ఎవ్వరూ దీనికి అతీతులు కారు. అందుకే హీరోయిన్లు ఎవ్వరూ ఆంటీ పాత్రలు చేయడానికి అంత త్వరగా ఆసక్తి […]

Written By:
  • admin
  • , Updated On : January 12, 2021 / 02:10 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో ఒక అనవాయితీ ఉంది. ఒక స్టార్ హీరోయిన్ గనుక, ఒక పెద్ద సినిమాలో ఆసాంతం “భార్య” పాత్రలోనే నటించిందా ? ఇక ఆ హీరోయిన్ ఫేడ్ అవుట్ అయిపోయినట్టే. ఇక ఆమె “సీనియర్ హీరోయిన్ల” ఖాతాలో చేరినట్లే అనేది మన మేకర్స్ అభిప్రాయం. అప్పటి భానుమతి, సావిత్రి దగ్గర నుండి నిన్నటి శ్రీయా, ప్రియమణి వరకూ ఎవ్వరూ దీనికి అతీతులు కారు. అందుకే హీరోయిన్లు ఎవ్వరూ ఆంటీ పాత్రలు చేయడానికి అంత త్వరగా ఆసక్తి చూపించరు. ఒక హీరోయిన్, ఒక్కసారిగా ఆంటీగా కనిపించిందా… ఇక మెల్లమెల్లగా గ్లామర్ హీరోయిన్, లవర్ గర్ల్ పాత్రలు ఆ హీరోయిన్ కి రావు.

    Also Read: సూపర్ స్టార్ ను బాధ పెడుతున్న ఫ్యాన్స్ !

    ప్రస్తుతం శృతి హాసన్ ఆంటీ జాబితాలో చేరినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన “క్రాక్” సినిమాలో శృతి హీరో భార్య పాత్రలో కనిపించి కాస్త బాగానే హడావుడి చేసింది. ఈ సినిమాలో ఆమె ఆంటీ కళ్యాణిగా కనిపించడమే కాకుండా.. ఓ ఐదారేళ్ళ కొడుకున్న తల్లిగా నటించి మెప్పించింది. నిజానికి శృతికి అవ్వాల్సిన టైంలో పెళ్లి అయి ఉంటే.. ఈ పాటికే పదేళ్ల కొడుకు ఉండేవాడు. కానీ, పెళ్లి లేకుండా శృతి ఇంకా సింగిల్ గానే ఉంటుంది. ఇక క్రాక్ సినిమాకి వస్తే.. బిగినింగ్ లోనే ఆమె భార్యగా దర్శనం ఇచ్చింది.

    Also Read: ‘క్రాక్’ డైరెక్టర్ కి బాలయ్య ఫోన్ ?

    కాగా చివర్లో ఒక చిన్న ట్విస్ట్ పెట్టినా శృతి పాత్ర నిడివి కూడా తక్కువ కావడం ఇప్పుడు ఆమెకు అది పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది. ఎలాగూ సెకండాఫ్ లో ఆమె కనిపించేది కూడా తక్కువే కాబట్టి.. ఇక శృతిని పూర్తిగా సీనియర్ హీరోయిన్ గా అప్రాధాన్య పాత్రలకే పరిమితం చేస్తారేమో. దీనికి తోడు త్వరలో విడుదల కానున్న “వకీల్ సాబ్” సినిమాలో కూడా ఆమెది పవన్ కళ్యాణ్ భార్య పాత్రనే. ఇందులో కూడా ఆమె ఒక పాటకు, కొన్ని సీన్లకే పరిమితం. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి రోల్స్ చేసుకుంటూ పోతే 34 ఏళ్ల శృతి హాసన్ ఇక ఆంటీ పాత్రలకే ఫిక్స్ అవ్వాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్