చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. పెరుగుతున్న కేసులు..?

కరోనా మహమ్మారి పుట్టినిల్లైన చైనాలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. డ్రాగన్ లో మళ్లీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో సోమవారం రోజున 103 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదు నెలల కాలంలో చైనాలో నిన్న నమోదైన కేసులే అత్యధికం కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో చైనా లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. Also Read: ప్రజలకు షాక్.. భారత్ లో […]

Written By: Navya, Updated On : January 12, 2021 2:59 pm
Follow us on

కరోనా మహమ్మారి పుట్టినిల్లైన చైనాలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. డ్రాగన్ లో మళ్లీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో సోమవారం రోజున 103 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదు నెలల కాలంలో చైనాలో నిన్న నమోదైన కేసులే అత్యధికం కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో చైనా లాక్ డౌన్ ను అమలు చేస్తోంది.

Also Read: ప్రజలకు షాక్.. భారత్ లో డేంజ‌రస్‌ క‌రోనా మ్యుటేష‌న్‌..!

చైనాలోని హెబీ, ఫ్రావిన్స్ ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని సమాచారం. కొత్తగా నమోదవుతున్న కేసులు కూడా ఈ ప్రాంతాల్లోనే నమోదవుతూ ఉండటంతో అధికారులు కఠిన ఆంక్షలను అమలు చేయడంతో పాటు భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

Also Read: స్మోకింగ్ చేసేవాళ్లకు అలర్ట్.. కరోనా ప్రభావం ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు..!

చైనాలో ఇప్పటివరకు 87,591 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం అత్యవసరమైతే మాత్రమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలని సూచనలు చేసింది. చైనాలో ఇప్పటివరకు 4,634 మంది కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. మరోవైపు కొత్తరకం కరోనా స్ట్రెయిన్ లు చైనాతో పాటు పలు దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు కోసం: అంతర్జాతీయం

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కరోనా వైరస్ పుట్టుక గురించి తెలుసుకోవడానికి చైనాకు వెళ్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఏ విధంగా సోకిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.