https://oktelugu.com/

‘క్రాక్’ డైరెక్టర్ కి బాలయ్య ఫోన్ ?

‘మాస్ మహారాజా’ రవితేజ గత ఏడు సినిమాలుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తూ.. ఈ క్రమంలో చేసిన సినిమా ‘క్రాక్’. నిజంగా మాస్ రాజాకి ఈ సినిమా నిజమైన హిట్ ను ఇచ్చింది. అసలు హిట్ రావడం కష్టమైపోయిన ఇలాంటి పరిస్థితుల్లో ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తూ మొత్తానికి ‘క్రాక్’ కేక అనిపించుకుంది. కాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అపూర్వ ఆద‌ర‌ణ‌తో క‌లెక్ష‌న్ల […]

Written By:
  • admin
  • , Updated On : January 12, 2021 / 01:58 PM IST
    Follow us on


    ‘మాస్ మహారాజా’ రవితేజ గత ఏడు సినిమాలుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తూ.. ఈ క్రమంలో చేసిన సినిమా ‘క్రాక్’. నిజంగా మాస్ రాజాకి ఈ సినిమా నిజమైన హిట్ ను ఇచ్చింది. అసలు హిట్ రావడం కష్టమైపోయిన ఇలాంటి పరిస్థితుల్లో ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తూ మొత్తానికి ‘క్రాక్’ కేక అనిపించుకుంది. కాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అపూర్వ ఆద‌ర‌ణ‌తో క‌లెక్ష‌న్ల ప్రభంజనం సృష్లించి, రవితేజ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ నిలిచింది.

    Also Read: సూపర్ స్టార్ ను బాధ పెడుతోన్న ఫ్యాన్స్ !

    మరి రవితేజకు అలాంటి హిట్ ను ఇచ్చిన గోపీచంద్ మలినేనికి ఇప్పుడు మరో పెద్ద ఛాన్స్ తగిలింది. నిజానికి ‘క్రాక్’ సినిమాలో దర్శకుడు గోపీచంద్ మలినేని కొన్ని మాస్ సీన్లు తీసిన విధానం చాల బాగుంది. ముఖ్యంగా సినిమాలోని బస్ స్టాండ్ ఫైట్, హీరోయిన్ శృతి హాసన్ కి పోకిరి తరహా ట్విస్ట్ ఇవ్వడం లాంటి వాటిల్లో గోపీచంద్ మంచి పనితనం కనబర్చాడు.  దాంతో, గోపీచంద్ కి సాలిడ్ కథ దొరికితే మాస్ హీరోలను బాగా ఎలివేట్ చేస్తాడనే పేరు వచ్చింది. ఆ కారణంగా మొత్తానికి బాలయ్య నుండి మనోడికి ఫోన్ వచ్చిందట.

    Also Read: స్టార్ల మధ్య పోటీలో బ్యాచలర్ నిలబడగలడా ?

    బాలయ్య బాబు తనకు సరిపోయే కథ ఉంటే చెప్పండి అంటూ గోపీచంద్ ను అడిగారట. మరి బాలయ్య అంటేనే మాస్.. అండ్ ఫుల్ యాక్షన్. అలాంటి కథతో గానీ, గోపీచంద్ వెళ్ళితే… బాలయ్యతో సినిమా ఓకే అయినట్లే. కాగా వీరిద్దరి కాంబినేషన్ ని సెట్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ట్రై చేస్తోందట. మరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ ఇప్పుడు సెట్ అవుతుందా లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతం బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో నటిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్