https://oktelugu.com/

ఫస్ట్ లుక్: సాధారణ గృహణిలా వెటరన్ బ్యూటీ శ్రియ..!

నేడు(సెప్టెంబర్ 11న) వెటరన్ బ్యూటీ శ్రియ పుట్టిన రోజు. టాలీవుడ్ తోపాటు తమిళ, మళయాలం, కన్నడ, హిందీ సినిమాల్లో శ్రియ నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్లో దశాబ్దానికి పైగా సినిమాల్లో నటించిన అగ్రహీరోయిన్ గా కొనసాగింది. ఇటీవల ఆండ్రీ కోస్చీప్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులపాటు భర్తతో ఫుల్ గా ఎంజాయ్ చేసిన శ్రియ మళ్లీ వెండితెరపై నటించేందుకు సిద్ధమవుతోంది. Also Read: శ్రావణి ఆత్మహత్యకు […]

Written By: , Updated On : September 11, 2020 / 12:36 PM IST
Sriya Gamana first look

Sriya Gamana first look

Follow us on

Sriya Gamana first lookనేడు(సెప్టెంబర్ 11న) వెటరన్ బ్యూటీ శ్రియ పుట్టిన రోజు. టాలీవుడ్ తోపాటు తమిళ, మళయాలం, కన్నడ, హిందీ సినిమాల్లో శ్రియ నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్లో దశాబ్దానికి పైగా సినిమాల్లో నటించిన అగ్రహీరోయిన్ గా కొనసాగింది. ఇటీవల ఆండ్రీ కోస్చీప్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులపాటు భర్తతో ఫుల్ గా ఎంజాయ్ చేసిన శ్రియ మళ్లీ వెండితెరపై నటించేందుకు సిద్ధమవుతోంది.

Also Read: శ్రావణి ఆత్మహత్యకు ముందు.. దొరికిన సీసీటీవీ ఫుటేజ్?

వెటరన్ బ్యూటీ శ్రియ పెళ్లి తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘గమనం’. శ్రియ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ మూవీ ఫస్టు లుక్కును దర్శకుడు క్రిష్ తాజాగా విడుదల చేశారు. శ్రియ చీర క‌ట్టుకొని.. మెడ‌లో పసుపుతాడు మాత్ర‌మే ఉన్న అతి సాధార‌ణ గృహిణిలా శ్రియ కనిపిస్తోంది‌. ఏదో విష‌యంపై తీవ్రంగా మథనపడుతున్నట్లు ఆమె ముఖకవళికలు ఉన్నాయి. ‘గమనం’ ఫస్టు లుక్ చూస్తుంటే శ్రియ ఓ కొత్త తరహా పాత్రతో అభిమానుల ముందుకు రాబోతుందని అర్థమవుతోంది.

‘గమనం’ మూవీని దర్శకుడు సుజనారావు తెరకెక్కిస్తున్నాడు. తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళం.. హిందీ భాషల్లో ఈ మూవీని రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తోంది. రియల్ లైఫ్ డ్రామాను తెరపై అద్భుతంగా తెరక్కెక్కించేందుకు దర్శకుడు సుజానారావు సన్నహాలు చేస్తున్నాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ‘గమనం’ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. నిర్మాతలుగా రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్లు వ్యవహరిస్తున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులతో చిత్రయూనిట్ బీజీగా ఉంది. రెండు దశాబ్దాలుగా చిత్రసీమలో అద్భుతమైన నటనతో అలరిస్తున్న శ్రియకు పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతోన్నారు. ‘గమనం’ శ్రియ అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Also Read: త్రివిక్రమ్-మహేష్ మళ్లీ కలుస్తారా?