https://oktelugu.com/

గంగవ్వ సేఫ్.. ఎలిమినేట్ అయ్యేది వీళ్లే?

బిగ్‌బాస్‌ సీజన్‌-4 గత ఆదివారం ప్రారంభమైంది. కరోనా కారణంగా ఈసారి అన్ని సీజన్లకంటే ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లను తీసుకురాగా.. 15 వారాలకు గాను ఒక్కో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవ్వాల్సి ఉంది. మొదటి వారం నుంచే కంటెస్టెంట్స్‌లో పోటాపోటీ నెలకొంది. ఎవరికి వారుగా తమ బలం నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఫస్ట్‌ వీక్‌కు గాను ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌ నామినేషన్లో ఉన్నారు. Also Read: ఫస్ట్ లుక్: సాధారణ గృహణిలా వెటరన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 12:40 PM IST
    Follow us on

    బిగ్‌బాస్‌ సీజన్‌-4 గత ఆదివారం ప్రారంభమైంది. కరోనా కారణంగా ఈసారి అన్ని సీజన్లకంటే ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లను తీసుకురాగా.. 15 వారాలకు గాను ఒక్కో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవ్వాల్సి ఉంది. మొదటి వారం నుంచే కంటెస్టెంట్స్‌లో పోటాపోటీ నెలకొంది. ఎవరికి వారుగా తమ బలం నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఫస్ట్‌ వీక్‌కు గాను ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌ నామినేషన్లో ఉన్నారు.

    Also Read: ఫస్ట్ లుక్: సాధారణ గృహణిలా వెటరన్ బ్యూటీ శ్రియ..!

    ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ప్రచారం అక్కర్లేని పేరు గంగవ్వ. యూట్యూబ్‌ స్టార్‌‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ ప్రస్తుతం హౌజ్‌లో 16 మంది ఉన్నా.. ప్రేక్షకులను ఎంటర్‌‌టైన్‌ చేసేది గంగవ్వ మాత్రమే. మొదటి వారంలోనే ఎలిమినేషన్‌కు నామినేట్‌ కావడం గేమ్‌లో ప్లానింగేనని తెలుస్తోంది. ఆమెతోపాటు దర్శకుడు సూర్యకిరణ్‌, అభిజిత్‌, అఖిల్‌ సార్థక్‌, దివి, మెహబూబా, సుజాత నామినేషన్‌లో ఉన్నారు.

    మొదటి వారం ఎవరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారనేది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిగా మారింది. అయితే.. అందరూ భావించినట్టుగానే గంగవ్వ ఓటింగ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ 40,000 మందికి పైగా ఓటు వేయగా.. సగానికి సగం మంది గంగవ్వకే మద్దతు ఇచ్చారు. మొత్తం ఓట్లలో 46 శాతం ఓట్లు గంగవ్వకే గుద్దారు. తరువాతి స్థానంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ 16 శాతం ఓట్లతో ఉన్నాడు. హీరోయిన్ దివి (దివ్య) 10 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంది. దర్శకుడు సూర్య కిరణ్ 9 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో, మెహబూబ్ 8 శాతం ఓట్లతో ఐదో స్థానంలోనూ, జోర్దార్ సుజాత 6 శాతం ఓట్లతో ఆరో స్థానంలో, అఖిల్ 5 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు.

    ఈ లెక్కన చూస్తే ఈ వారం గంగవ్వ, అభిజిత్‌ సేఫ్‌ అని ఓటింగ్‌ బట్టి తెలుస్తోంది. దివి, సూర్యకిరణ్, మొహబూబ్, సుజాత, అఖిల్ సార్థక్ ఓట్ల శాతంలో పెద్దగా తేడాలు లేకపోవడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది. గురువారం నాటి ఎపిసోడ్‌తో హీరోయిన్ దివికి మంచి హైప్ వచ్చింది. ఆమె గ్లామర్‌తోపాటు నెమ్మదిగా ఉండటం.. సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ద్వారా ఆమెకు మంచి మార్కులే పడుతున్నాయి. సో.. గంగవ్వ, అకిల్ సార్థక్‌లతో పాటు దివి కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఓటింగ్‌లో కూడా ఆమె మూడో ప్లేస్‌లో ఉంది.

    Also Read: చెప్పులకు ఫ్రేమ్ కట్టించిన స్టార్ డైరెక్టర్, కమెడియన్.. ఎందుకు?

    ఇక సూర్యకిరణ్‌, మెహబూబ్‌, సుజాత, అఖిల్‌ సార్థక్‌ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురులో ఒకరు ఎలిమినేట్ కావడం మాత్రం పక్కా. సూర్య కిరణ్ ముందు నుంచి హౌస్‌లో దురుసుగా ప్రవర్తిస్తుండగా.. తను చెప్పిందే కరెక్ట్ అన్న ధోరణి అతనికి మైనెస్‌ అవుతోంది. మెహబూబాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ బిగ్ బాస్‌లో తన సత్తా చాటే అవకాశం రాలేదు. సుజాత అయితే కళ్యాణితో గొడవతో బాగానే ఫోకస్ అయ్యింది కాని.. అది ఓట్లు కురిపిస్తుందా? అన్నది సందేహమే. అఖిల్ సార్థక్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. వీరిలో ఎక్కువ శాతం అఖిల్ సార్థక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన సేఫ్‌ జోన్లోకి వెళ్తే సూర్య కిరణ్, సుజాతల్లో ఎవరో ఒకరికి ముప్పు వాటిల్లినట్లే.