https://oktelugu.com/

చెప్పులకు ఫ్రేమ్ కట్టించిన స్టార్ డైరెక్టర్, కమెడియన్.. ఎందుకు?

ఓ జాతీయ ఛానల్ ముందు బాలీవుడ్ చెందిన ఇద్దరు సెలబ్రెటీలు హల్చల్ చేశారు. చెప్పులకు ఫ్రేమ్ కట్టించి ఆ ఛానల్ ఎదుట నిరసన తెలుపడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దీంతో అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతీఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. Also Read: త్రివిక్రమ్-మహేష్ మళ్లీ కలుస్తారా? బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాలు గురువారం ముంబాయిలోని రిపబ్లిక్ టీవీ కార్యాలయం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 12:32 PM IST

    Anurag kasyap kunal

    Follow us on


    ఓ జాతీయ ఛానల్ ముందు బాలీవుడ్ చెందిన ఇద్దరు సెలబ్రెటీలు హల్చల్ చేశారు. చెప్పులకు ఫ్రేమ్ కట్టించి ఆ ఛానల్ ఎదుట నిరసన తెలుపడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దీంతో అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతీఒక్కరు ఆసక్తి చూపుతున్నారు.

    Also Read: త్రివిక్రమ్-మహేష్ మళ్లీ కలుస్తారా?

    బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాలు గురువారం ముంబాయిలోని రిపబ్లిక్ టీవీ కార్యాలయం ఎదుట ప్రత్యక్షమయ్యారు. వారిద్దరు అక్కడికి చెప్పులకు లామినేషన్ చేసిన ఫొటోలను తీసుకెళ్లడం గమనార్హం. ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీని.. సెలబ్రెటీలను పదేపదేగా తప్పుగా చూపిస్తున్న వారిని ఇమేజ్ ను రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి వారు ఆరోపిస్తున్నారు.

    అర్నబ్ గోస్వామి జర్నలిజంలో అత్యున్నత విలువలు పాటిస్తున్నారంటూ అభినందిచడానికి తాము తీసుకెళ్లిన పురస్కారాలను అందించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని ఛానల్ లోపలికి అనుమతించ లేదు. దీంతో వారు కార్యాలయం ఎదుటే వారు తీసుకెళ్లిన చెప్పుల ఫ్రేములతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. గురువారం అర్నాబ్ పుట్టిన రోజు కూడా విశేషం.

    Also Read: శ్రావణి ఆత్మహత్యకు ముందు.. దొరికిన సీసీటీవీ ఫుటేజ్?

    దేశభక్తి విషయంలో టీవీ చర్చల్లో అర్నాబ్ లౌకిక వాదులందరినీ ఏకీపారేస్తుంటాడు. టీవీ డిబెట్లకు పిలిచిమరీ వారిని నోరత్తకుండా మాట్లాడుతుంటారు. దీంతో ఆయన ఎవరూ కూడా గొడవలు పెట్టుకునే సాహనం చేయరు. అలాంటి బాలీవుడ్ కు చెందిన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కమెడియన్ కునాల్ రిపబ్లిక్ ఛానల్ ఎదుటే చెప్పులతో నిరసన తెలుపడం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల రిపబ్లిక్ ఛానల్ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఏకపక్ష కథనాలతో విషం చిమ్మే కార్యక్రమం చేస్తుండటం వారిద్దరు ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.