ఈ కరోనా విలయతాండవం కారణంగా హీరోయిన్స్ ఇంటికే పరిమితం అయిపోయారు. కొంతమంది బ్యూటీస్ యాడ్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ.. కొన్ని కంపెనీలకు డిజిటల్ ప్రమోషన్స్ చేస్తూ ఈ లాక్ డౌన్ టైంలో కూడా బిజీబిజీగా సంపాదిస్తూ ముందుకు పోతుంటే.. ‘ప్రణీత సుభాష్’ లాంటి హీరోయిన్స్ కరోనా బాధితులకు సహాయం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు.
అయితే, కోవిడ్ బాధిత కుటుంబాల్లో దుఃఖం రోజురోజుకు పెరుగుతుందని, అలాగే కరోనా సోకిన ఫ్యామిలీస్ లో కూడా కోవిడ్ ఎప్పుడు అటాక్ చేస్తోందా అని అందరం ఒక టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామని, అందుకే నా డ్యాన్స్ తో ఈ టెన్సన్స్ నుండి మీ మనసులని తేలిక పర్చడానికి ఒక ప్రయత్నం చేస్తాను అంటూ హీరోయిన్ శ్రీయా కాస్త కొత్తగా ట్రై చేసింది.
ఇందులో భాగంగా మొత్తానికి తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను ప్రస్తుతం నెటిజన్లు తెగ షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోతో పాటు శ్రీయా ఒక మెసేజ్ ను కూడా పెట్టింది. “అటు తీవ్ర తుఫాన్. ఇటు కఠినమైన కరోనా. అవును, ఇది సంక్షోభ కాలం. అందుకే ప్రకృతి మాత కోసం ఈ డ్యాన్స్.
నా డ్యాన్స్ చూసిన తరువాత మీ ముఖాల్లో కొంతైనా సంతోషం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను’ అని శ్రీయా ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇక 37 ఏళ్ళ శ్రియా తన భర్తతో కలిసి ప్రస్తుతం స్పెయిన్ లో ఉంటుంది. అక్కడే దాదాపు సెటిల్ అయ్యామని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరోపక్క కొత్త అవకాశాల కోసం ఇంకా శ్రీయా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.