https://oktelugu.com/

ఆమె అన్ని భరించింది.. కానీ హీరోయిన్ గా నిలబడలేకపోయింది !

ఆమెకు మంచి అందం ఉంది, అలాగే ఆమెలో చక్కని అభినయం కూడా ఉంది. అయినా ఆమె హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఎన్నడూ ఒళ్ళు దాచుకోకుండా సినిమా కోసం ఏమి చేయడానికైనా ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. అయినా ఆమె సక్సెస్ కాలేదు. నిజానికీ ఆమె ఎప్పుడూ రెమ్యునరేషన్ కోసం కూడా ఆలోచించింది లేదు, ఆమెకు కావాల్సింది మంచి పాత్రలు మాత్రమే. అయినా ఎందుకో ఆమెకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఏ దర్శకుడు ఆమెకు మంచి […]

Written By:
  • admin
  • , Updated On : April 10, 2021 / 04:09 PM IST
    Follow us on


    ఆమెకు మంచి అందం ఉంది, అలాగే ఆమెలో చక్కని అభినయం కూడా ఉంది. అయినా ఆమె హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఎన్నడూ ఒళ్ళు దాచుకోకుండా సినిమా కోసం ఏమి చేయడానికైనా ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. అయినా ఆమె సక్సెస్ కాలేదు. నిజానికీ ఆమె ఎప్పుడూ రెమ్యునరేషన్ కోసం కూడా ఆలోచించింది లేదు, ఆమెకు కావాల్సింది మంచి పాత్రలు మాత్రమే. అయినా ఎందుకో ఆమెకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఏ దర్శకుడు ఆమెకు మంచి పాత్ర ఇవ్వలేదు.

    కారణాలు తెలియదు గానీ, ఆమె అంటే మొదటినుండి సినిమా ఇండస్ట్రీకి .చిన్న చూపే. ఆమె కంటే అందం తక్కువ ఉన్న హీరోయిన్స్ ను కూడా నెత్తిన పెట్టుకున్న నిర్మాతలు.. ఆమె పట్ల అశ్రద్ధ చూపించారు. దాంతో ఆమె విసిగిపోయింది, ఓ దశలో నగ్న ప్రదర్శనలకు కూడా తానూ సర్వదా సహస్రా కట్టుబడి ఉన్నాను అని చాటి చెప్పడానికి.. ఆమె సోషల్ మీడియాలో హద్దులుమీరి ఎక్స్ పోజింగ్ చేసింది. అయినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు.

    అయితే, ఆమె అర్ధనగ్న ప్రదర్శనలు నచ్చిన మేనేజర్లు ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో సెకెండ్ లీడ్ క్యారెక్టర్స్ ఇప్పించారు. కానీ ఆమె కెరీర్ బాగుపడలేదు. పైగా అవకాశాలు ఇప్పించాం కదా.. మరీ.. ? అంటూ వంకర చూపులు ఆమె పై చూడటం ఎక్కువైపోయాయి. అయినా అన్ని భరించింది. తనకున్న అవకాశాల దాహం కోసం కొన్ని విషయాల్లో ఆమె సర్దుకుపోయింది. అయినా ఆమెకు మంచి పాత్రలు రాలేదు.

    ఎలాగూ అందాలను పదర్శించడంలో అనుభవం వచ్చింది కాబట్టి.. బోల్డ్ పాత్రలకు యస్ చెప్పింది. రొమాంటిక్ గా నటించడంలో ఆరితేరిపోయింది. ఇలా ఎంత చేసినా ఏమి చేసినా ఆమె స్టార్ కాలేకపోయింది. ఈ లోపు కాలం కూడా చాల ముందుకు వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెరిగిన వయసు.. కొన్ని చేదు జ్ఞాపకాలు. సరే కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ అయినా చూద్దాం అంటే.. పెద్దగా సంపాదించింది కూడా ఏమి లేదు అని అర్థమైంది. అసలు ఇప్పటికీ ఆమెకు తన కెరీర్ లో ఎక్కడ తప్పు చేశానో అని అర్ధం కావడం లేదట. ఇంతకీ ఎవరు ఆమె..? ఆమె ‘శ్రద్ధా దాస్’.