Shraddha Arya: ‘గొడవ’ అనే సినిమా గుర్తుందా ? ఉండకపోవచ్చు లేండి, ఆ సినిమా ప్లాప్ సినిమా కదా, హిట్ సినిమాలనే మర్చిపోతున్నారు జనం. ఇక ప్లాప్ సినిమాలు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు. ఇంతకీ ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఈ ‘గొడవ’ సినిమా గురించి ఎందుకంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రద్ధ ఆర్య. ఈ భామ నిన్న వివాహబంధంలోకి అడుగుపెట్టింది. శ్రద్ధ ఆర్య నావల్ ఆఫీసర్ రాహుల్ నాగల్ ని ప్రేమించి పెళ్లాడింది.

ముంబైలో ఓ చిన్న రీస్టార్ట్ లో వీరి పెళ్లి వేడుక సింపుల్ గా జరిగింది. అంతే సింపుల్ గా ‘జస్ట్ మారీడ్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. శ్రద్ధ ఆర్య – రాహుల్ నాగల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరిద్దరూ కలిసింది మాత్రం ఓ పెళ్ళిలోనట. పెళ్లిలో కలిసి మొత్తానికి పెళ్లితో ఒకటి అయ్యారు.
మొదటి చూపులోనే ఒకరికి ఒకరు బాగా నచ్చారు. ముఖ్యంగా శ్రద్ధ ఆర్య నటి అని తెలిసాక, రాహుల్ ఆమె పై మరింత ప్రేమ పెంచుకున్నాడట. నటన పై రాహుల్ కి చిన్న తనం నుంచి ఇంట్రెస్ట్ ఉందట. అందుకే ఇష్టపడి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రద్ధ ఆర్య ‘గొడవ’ సినిమాతో పాటు ‘కోతిమూక’, ‘రోమియో’ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.
ఈ భామ ఆ తర్వాత సినిమాలను వదిలేసి.. కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా నటించింది. మెయిన్ గా “కసం తేరే ప్యార్ కే”, “కుండలి భాగ్య” వంటి సూపర్ హిట్ సీరియల్స్ తో కూడా శ్రద్ధ ఆర్య బాగా పాపులర్ అయింది. అయితే, తెలుగులో మాత్రం ఆమె హీరోయిన్ గా పెద్దగా పాపులర్ కాలేదు.
సినిమాల్లో ఫెయిల్ అయినా సీరియల్స్ లో సూపర్ హిట్ అయింది. అలాగే శ్రద్ధ ఆర్య జీతంలో కూడా ఫుల్ సక్సెస్ కావాలని కోరుకుంటూ.. ఆమెకు పెళ్లి సందర్భంగా మా ఓకేతెలుగు.కామ్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు.
Also Read: Vikram movie: విక్రమ్ సినిమా షూటింగ్ షురూ.. కమల్‌తో పాటు బరిలోకి ఆ ఇద్దరు హీరోలు!