Chiranjeevi: సినిమా ఇండస్ట్రీ అయినా ఇతర ఏ ఇండస్ట్రీ అయినా తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటేనే ఎదగడం సులభం అవుతుంది. గుంపులో గోవిందం లాగా ఉంటే స్పెషాలిటీ ఉండదు. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి స్టార్లుగా ఎదిగారు. అయినా కూడా అహర్నిశలు కష్టపడుతూ తమ పేరును పదిలం చేసుకుంటారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి కూడా సీనియర్ నటుడుగా చాలా కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాకు ఒక్కో విధమైన స్టైల్ ను చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్షించడంలో సఫలం అవుతుంటారు.
25 సంవత్సరాల వయసులో ఎలా నటిస్తారో ఇప్పుడు కూడా అదే విధంగా నటిస్తారు చిరు. ఈ వయసులో కూడా నటన మీద ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా నటిస్తారు. ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటారు మెగాస్టార్. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ.. సీనియర్ స్టార్ హీరోగా ఎదిగిన చిరు ఇప్పుడు కూడా వరుస సినిమాల్లో నటించడం యంగ్ హీరోలకు కష్టమే అని చెప్పాలి. అయితే ఈ యంగ్ హీరోలు చిరును చూసి కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తుంటారు.
ఒకే సంవత్సరంలో ఒక సినిమాకు మించి మరో సినిమా చేయడం లేదు యంగ్ హీరోలు. కానీ చిరంజీవి మాత్రం ఒకే సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. తొందర పడతున్నారు అనుకున్నా కూడా.. ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఏదొ ఒక సినిమా మాత్రమే ఆవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. మిగిలిన సినిమాలు సూపర్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. ఇక ఈ విధంగా యంగ్ హీరోలు ఇప్పటికీ కూడా రెండు మూడు సినిమాల్లో నటించలేకపోతున్నారు. ఈ విధంగా యంగ్ హీరోలు కూడా చిరును ఆదర్శంగా తీసుకుంటే బాగుండని కోరుకుంటున్నారు చిరు అభిమానులు.