https://oktelugu.com/

Kajal Aggarwal: న్యూఇయర్ వేడుకల్లో కాజల్ ఎంజాయ్ ను చూస్తే తట్టుకోలేరంతే…వైరల్ ఫొటోలు.

కాజల్ మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఎందుకు అంటే కాజల్ తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను చేసుకుంది దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2024 / 06:03 PM IST

    Kajal Aggarwal

    Follow us on

    Kajal Aggarwal: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఇక దశాబ్దం పాటు ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకొని అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఫుల్ ఫ్లెడ్జడ్ గా హీరోయిన్ రోల్స్ అయితే చేయడం లేదు.

    ఇక ఇప్పుడు కాజల్ మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఎందుకు అంటే కాజల్ తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను చేసుకుంది దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు కొంచెం బొద్దుగా అయిన కాజల్ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఆ ఫొటోస్ లో కాజల్ ను చూసిన ఆమె అభిమానులు ఆమె పైన పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. చాలా అందగత్తె అంటూ మరికొందరు కామెంట్లు పెడుతుంటే తను ఫ్యామిలీ లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తూ వస్తుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన కాజల్ పెళ్లి చేసుకుని పద్ధతిగా ఫ్యామిలీతో గడుపుతుండడం ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి.

    ఇక ఇదే క్రమంలో కాజల్ రీసెంట్ గా బాలయ్య బాబు తో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో పెద్దగా ఆమెకి స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్న పరిధిలో ఆమె క్యారెక్టర్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు కూడా కొన్ని తెలుగు సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా సినిమాకి సంబంధించిన మంచి క్యారెక్టర్ ఉంటే తను ఎప్పుడు చేయడానికి ముందుకు వస్తానని ఇంతకుముందే తను చాలాసార్లు తెలియజేసింది.

    ఇక అందులో భాగంగానే తను ఇప్పుడు కొన్ని సెలెక్టెడ్ క్యారెక్టర్లు మాత్రమే చేస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తూ వస్తుంది. మొత్తానికైతే తను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ లోనే ఉండాలనేది తన కోరిక అని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పింది.ఇక మంచి క్యారెక్టర్లు వస్తే మాత్రం సినిమాలు చేస్తాను అంతే తప్ప వేరే క్యారెక్టర్లు అయితే తను సినిమాలు చేయనని తేల్చేసి చెప్పేసింది. ఇక ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటె తనకి ఇవ్వాలని దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది…