Homeఎంటర్టైన్మెంట్'ఎవరు మీలో కోటిశ్వరులు’కోసం ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్!

‘ఎవరు మీలో కోటిశ్వరులు’కోసం ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్!

ఎన్టీఆర్ టాలెంట్ గురించి అంద‌రికీ తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై తానేంటో నిరూపించుకున్న జూనియ‌ర్‌.. బుల్లితెర‌పైనా స‌త్తా చాటాడు. బిగ్ బాస్ ప్రారంభం సీజ‌న్లో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన జూనియ‌ర్‌.. చివ‌రి వ‌ర‌కు షోను అద్భుతంగా ర‌న్ చేశాడు. ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ గ్రాబ్ చేయ‌డంలో.. ఎండ్ వ‌ర‌కు వారిని క‌నెక్ట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. దీంతో.. ఇప్పుడు జెమిని టీవీ ఆధ్వర్యంలో రాబోతున్న ‘ఎవరు మీలో కోటిశ్వరులు’కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు తార‌క్‌. Also Read: చిరంజీవితో […]

Evaru Meelo Koteeswarulu
ఎన్టీఆర్ టాలెంట్ గురించి అంద‌రికీ తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై తానేంటో నిరూపించుకున్న జూనియ‌ర్‌.. బుల్లితెర‌పైనా స‌త్తా చాటాడు. బిగ్ బాస్ ప్రారంభం సీజ‌న్లో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన జూనియ‌ర్‌.. చివ‌రి వ‌ర‌కు షోను అద్భుతంగా ర‌న్ చేశాడు. ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ గ్రాబ్ చేయ‌డంలో.. ఎండ్ వ‌ర‌కు వారిని క‌నెక్ట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. దీంతో.. ఇప్పుడు జెమిని టీవీ ఆధ్వర్యంలో రాబోతున్న ‘ఎవరు మీలో కోటిశ్వరులు’కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు తార‌క్‌.

Also Read: చిరంజీవితో వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ అదరనుందట..!

దాదాపు 120 దేశాల్లో ఈ షో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. మ‌న‌దేశంలో హిందీలో ‘కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి’ పేరుతో దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విజయవంతంగా ఈ షోను రన్ చేస్తున్నారు. అయితే.. తెలుగులో ఈ షో ఇప్ప‌టికే ప్ర‌సారం అయిన సంగ‌తి తెలిసిందే. మాటీవీలో వ‌చ్చిన ఈ షోను తొలుత నాగార్జున‌, ఆ త‌ర్వాత చిరంజీవి కంటిన్యూ చేశారు. కొంత గ్యాప్ త‌ర్వాత ఈ ప్రోగ్రాం హ‌క్కుల‌ను జెమిని టీవీ సొంతం చేసుకుంది. దీనికి హోస్ట్ గా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను సెల‌క్ట్ చేసుకుంది.

అయితే.. ఈ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించినందుకు తార‌క్ కు ఎంత పారితోషికం చెల్లిస్తున్నారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. కాగా.. ఈ షోకు ఎన్టీఆర్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్ చెల్లిస్తున్నారు. అయితే.. అది నాగార్జున కంటే ఎక్కువ కాగా.. మెగాస్టార్ కంటే త‌క్కువ‌గా ఉంది. మాటీవీలో ఈ షో ర‌న్ చేసిన నాగార్జునకు రూ.4.5 కోట్లు చెల్లించారు. ఆయ‌న త‌ర్వాత హోస్టుగా వ‌చ్చిన మెగాస్టార్ కు ఏకంగా రూ.9 కోట్లు చెల్లించారు. ఇది తెలుగు టెలివిజ‌న్ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ గా రికార్డుల్లోకి ఎక్కింది.

Also Read: ఫ్రైడే ఫైట్ః ఒకే ఒక్క స‌క్సెస్ అంటున్న ముగ్గురు హీరోలు!

కాగా.. జెమిని టీవీ కూడా ఎన్టీఆర్ కు భారీగానే పారితోషికం చెల్లిస్తోంది. మొత్తం 60 ఎపిసోడ్ల‌లో సాగుతున్న ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించినందుకు జూనియ‌ర్ కు రూ.7 కోట్లు చెల్లిస్తున్నార‌ట‌. మే మొద‌టి వారంలో ప్రారంభం కాబోతున్న ఈ షోకు సంబంధించి శ‌ర‌వేగంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కంటిస్టెంట్ల‌ను ఎలా ఎంచుకుంటారు? వంటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper