టాలెంట్ ఉన్నప్పటికీ కమెడియన్లు సినిమాలలో అవకాశాలు సంపాదించుకోవాలంటే తేలికైన విషయం కాదు. సినిమాల్లో ఛాన్స్ వచ్చినా ఆ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే కొత్త సినిమాలలో ఆఫర్లు దక్కుతాయి. అవకాశాలు దక్కినా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ పొందాలంటే సంవత్సరాల పాటు ఎదురుచూడాలి. కమెడియన్లుగా ప్రతిభ ఉండి మంచి ఆఫర్లను సంపాదించుకోవాలని అనుకునే వాళ్లకు జబర్దస్త్ షో బెస్ట్ షో అని చెప్పవచ్చు.
జబర్దస్త్ షోకు గత కొన్నేళ్లుగా రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా రోజాకు నెలకు ఏకంగా 20 లక్షల రూపాయలు పారితోషికంగా వస్తుందని తెలుస్తోంది. మరో జడ్జి మనోకు నెలకు 10 లక్షల రూపాయలకు అటూఇటుగా పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్ నెలకు మూడున్నర లక్షల రూపాయల వరకు పారితోషికం లభిస్తుందని సమాచారం. హైపర్ ఆదికి ఈ షో ద్వారా నెలకు మూడు లక్షల రూపాయలు పారితోషికంగా అందుతోంది.
రచయిత, నటుడు అయిన రామ్ ప్రసాద్ నెలకు 3 లక్షల రూపాయలు, గెటప్ శ్రీను 2.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. రాకెట్ రాఘవ నెలకు 2.5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటుండగా జబర్దస్త్ షోలో 75,000 రూపాయలు అతి తక్కువ జీతమని సమాచారం. గతంలో స్కిట్ల చొప్పున పారితోషికాలు ఇచ్చిన జబర్దస్త్ నిర్వాహకులు ప్రస్తుతం నెలవారీ జీతంగా ఈ మొత్తాన్ని ఇస్తున్నారని తెలుస్తోంది.
ఈ కమెడియన్లు బయట ఏవైనా ఈవెంట్లు చేస్తే ఒక్కరోజుకు ఏకంగా 50,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పారితోషికంగా లభిస్తోంది. సినిమాల్లో సైతం జబర్దస్త్ కమెడియన్లకు వరుసగా ఆఫర్లు వస్తుండటం గమనార్హం. జబర్దస్త్ షోలో స్కిట్లు చేసి ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల సినిమాలకే పూర్తిస్థాయిలో పరిమితమైన నటులు కూడా ఉండటం గమనార్హం.