కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఈ రోజు తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి దీంతో మరో బిగ్ ఫైట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఐపీఎల్ సెకండాఫ్ హోరాహోరీగా సాగుతోంది.

ప్రతి మ్యాచ్ రసవత్తంగా సాగుతోంది. ముఖ్యంగా ఫ్లే ఆఫ్ రేసు కోసం సన్ రైజర్స్ తప్ప అన్ని ప్రయత్నిస్తుండడంతో అభిమానులకు మజా వస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరి ఆటగాళ్ల పై అందరి కళ్లూ ఉన్నాయి వారిలో కోల్ కతా బ్యాటిట్స్ మెన్ వెంకటేశ్ అయ్యర్. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడి 126 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తో కలిసి కోల్ కతాకు అవసరమైన విజయాలు అందిస్తున్నాడు. ఈరోజు మ్యాచ్ లో పంజాబ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని ఎలా ఎదుర్కొంటానేది కీలకంగా మారింది. మరో వైపు హర్ ప్రీత్ సైతం వెంకటేశ్ ను ఇబ్బందులు పెడతాడేమో చూడాలి.
ఇక పంజాబ్ జట్టు బౌలర్లలో రవి బిష్ణోయ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. దానికి తోడు అవసరమైన వేళ వికెట్లు పడగొడుతున్నాడు. ఇప్పటి వరకు 6.16 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టగల ఈ యువ స్పిన్నర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయాలంటే ఆ జట్టులో బిష్ణోయ్ ప్రధాన బౌలర్ గా కనిపిస్తున్నాడు.