Chiranjeevi: పవన్ కళ్యాణ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక పక్క ఆయన వైసీపీపై విమర్శలు చేస్తుంటే మరో వైపు అన్నయ్య చిరంజీవి వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై చిరంజీవి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పవన్ కు ఎవరి నుంచి మద్దతు తెలపడం లేదు. దీన్ని సాక్షాత్తు వైసీపీ మంత్రులే సూచిస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించినా తన కుటుంబమే తనకు అండగా లేదనేది తెలుస్తోంది.

సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఒంటరి అయిపోయారనే వార్తలు వస్తున్నాయి. దీనికి చిరంజీవి చర్యలే తార్కాణంగా నిలుస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని వైసీపీ నేతలు చెబుతున్నా ఆయన ఖండించలేదు. దీనికి వారి మాటల్లో నిజం ఉందనేది స్పష్టం అవుతోంది. ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల్లో చిరంజీవి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లేందుకు నిర్ణయించుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
రాజమండ్రిలో అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆస్పత్రి ఆవరణలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు చిరంజీవి రానున్నారు. ఇందులో వైసీపీ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ వెల్లడించారు. చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, అల్లు అరవింద్ తదితరులు రానున్నారు. చిరంజీవి పర్యటన నేపథ్యంలో అభిమానులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చిరంజీవితో పాటు మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలరావు, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మార్గాని భరత్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీంతో ఒకపక్క పవన్ కళ్యాణ్ వైసీపీ మీద మాటల యుద్ధం చేస్తుంటే మరో పక్క అన్నయ్య వారితోనే సఖ్యతగా ఉండడంపై అందరిలో ఆసక్తి రేపుతోంది. అసలు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మద్దతు లేదనే విషయం స్పష్టం అవుతోంది. వైసీపీకి చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పైగా వారితో కలిసి చిరంజీవి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పవన్ కళ్యాణ్ ఏకాకిగా మారారని సమాచారం.