https://oktelugu.com/

‘Brow the Avatar’ Pre-release Event ‘బ్రో ది అవతార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి షాకింగ్ గెస్ట్..ఇది వింటే ఫ్యాన్స్ ఏమైపోతారో!

ఆ ముఖ్య అతిథి మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి అట. పవన్ కళ్యాణ్ ఈవెంట్స్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చాలా కాలం అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : July 21, 2023 / 05:50 PM IST
    Follow us on

    ‘Brow the Avatar’ Pre-release Event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రేపు విడుదల చెయ్యబోతుండగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 25 వ తారీఖున హైదరాబాద్ లో జరపనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే.

    అయితే ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులు ఎవ్వరూ ఉండరు, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అని మేకర్స్ గతం లో తెలిపిన సంగతి మన అందరికీ తెలిసిందే. కాని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి రాబోతున్నారు అట.

    ఆ ముఖ్య అతిథి మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి అట. పవన్ కళ్యాణ్ ఈవెంట్స్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకి చిరంజీవి ముఖ్య అతిథి గా వచ్చాడు. పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడి ఆ చిత్రం పై హైప్ పెంచేలా చేసాడు.

    ఇప్పుడు ‘బ్రో ది అవతార్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరై పవన్ కళ్యాణ్ గురించి సినిమా గురించి గొప్పగా మాట్లాడుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాని ఫలితాలు మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కి వచ్చినట్టుగా రాకూడదని,’బ్రో’ చిత్రం గ్రాండ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. చాలా కాలం తర్వాత మెగా హీరోలను ఒకే చోట చూడబోతున్నందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఏమి మాట్లాడబోతున్నాడో చూడాలి.