AP CM YS Jagan : జగన్ లీడర్ కాదు.. రీడరా? జనాల కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతున్నారా? ప్రజలను చూసి భయపడిపోతున్నారా? ఆయన ప్రసంగాల శైలి చూస్తుంటే చిన్నపిల్లడి మాదిరిగా ఉందా? ఇప్పడు ఏపీలో విపక్షాలు ఇదేరకమైన ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ నేరుగా ప్రసంగించలేకపోతున్నారని.. పేపరు చూడకుండా మాట్లాడలేకపోతున్నారని సెటైర్లు పడుతున్నాయి. ఈ రోజు తిరుపతి జిల్లా ధర్మవరంలో జగన్ గట్టిగానే మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్, బాలక్రిష్ణలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆరోపణలైతే చేశారు. కానీ అవి అంతగా పేలలేదు. పేపరు చూసి ప్రసంగించడంతో ఎవరో రాసిన స్క్రిప్టుగా ప్రజలు భావిస్తున్నారు.
సీఎం జగన్ గతంలో అనర్గళంగా మాట్లాడేవారు. ఎప్పుడో ఓసారి సాయానికి అన్నట్టు పేపరు వైపు చూసేవారు. కానీ ఇటీవల వరుస సమావేశాల్లో ఆయన నిత్యం పేపరు చూస్తూ కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు సైతం నిరాశపడుతున్నారు. జగన్ లో వచ్చిన మార్పుచూసి ఆందోళన చెందుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసే సమయంలో జగన్ సమయస్ఫూర్తి గా మాట్లాడేవారు. నాటి తెగువ ఏమైందని ఇప్పుడు పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇలానే పేలవ ప్రసంగాలు చేస్తే వర్కవుట్ కాదని వాపోతున్నారు.
అయితే వైసీపీ అభిమానులు భయపడినట్టే జరుగుతోంది. జగన్ పేపరు చూసిన ప్రసంగాలపై రాజకీయ ప్రత్యర్థులు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. పేపరు చూసి ప్రజాసమస్యలపై మాట్లాడలేని సీఎం.. విపక్ష నేతలపై ఆరోపలకు సైతం అదే పేపర్లుపై ఆధారపడుతుండడం విడ్డూరంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్రోలింగ్ చేస్తున్నారు. మా నేతలపై విమర్శలు చేయడం కాదు.. మా నేతల్లా పేపరు చూడకుండా మాట్లాడాలని సవాల్ చేస్తున్నారు. అసలు జగన్ లీడర్ కాదు రీడర్ అంటూ కొత్త కామెంట్లుపెడుతున్నారు. ప్రజలను నేరుగా చూసి మాట్లాడే ధైర్యం లేకే ఇలా తలదించుకొని పేపర్లు చూసి మాట్లాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.
జగన్‌లో వచ్చిన మార్పును వైసీపీ కేడర్ కూడా గమనిస్తోంది. మన సేవా మిత్రులు, సేవా వజ్రాలు అయిన మన వలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పు పట్టిందెవరో తెలుసా? అని చదువుతూ కనిపించారు. అయితే ఈ కాన్సెప్ట్ మంచిదే అయినా పేపరు చూసి చెప్పేసరికి తేలిపోయింది. విమర్శలను కూడా చదువుతూ కొనసాగించడంపై వైసీపీ అభిమానులకు నచ్చడం లేదు. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కేవలం సమాచారం కోసమే పేపర్లు చూసుకుంటారని ఆ పార్టీల నాయకులు గుర్తు చేస్తున్నారు. జగన్ నేరుగా జనం కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడకపోవడాన్ని తప్పు పడుతున్నారు. మొత్తానికైతే సీఎం జగన్ ఏవేవో మాట్లాడి ఇలా అడ్డంగా బుక్కయ్యారన్న మాట.