Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఒక్కో విషయం బయటకు వస్తోంది. ఆమె తన కెరీర్ లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఫ్యాషన్ డిజైనర్లకు సంపాదన కూడా బాగానే ఉంటుంది. బాధలు కూడా అంతగా ఉండకపోయినా ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఒక్కో విషయంపై ఆరా తీస్తున్నారు. ఆమె పది రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే ఆమె పలు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక నిండు ప్రాణం బలైపోవడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతగా ఆత్మహత్య చేసుకోవాల్సిన బాధలు ఏమున్నాయనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రత్యూష సులభంగా చనిపోవడం ఎలా అనే కోణంలో ఇంటర్నెట్ లో కూడా వెతికినట్లు తెలుస్తోంది. చనిపోయేందుకు చాలా ధైర్యం కావాలి. అందుకే ఆమె తన మరణాన్ని సులభంగా ముగించాలని పలు మార్గాలు వెతికినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సామాజిక మాధ్యమాల్లో చావుకు సంబంధించిన కొత్త మార్గాలు ఏమైనా ఉన్నాయనేదానిపై సర్చ్ చేసినట్లు చెబుతున్నారు. అంటే ముందుగానే ఆమె చనిపోయేందుకు పలు ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. దీని కోసమే పలు సైట్లలో సులభంగా చావడానికి గల దారులను అన్వేషించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
Also Read: Prabhu Deva Ex-Wife: నయనతార పై సంచలన ఆరోపణలు చేసిన ప్రభుదేవా మాజీ భార్య
తన చావుకు ఉపయోగపడే కార్బన్ మోనాక్సైడ్ ను కూడా ఆమె కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందే సూసైడ్ నోటు రాసినట్లు చెబుతున్నారు. అది ఆమె చేతిరాతే అని విచారణలో తెలిసింది. మొత్తానికి ప్రత్యూష ఆత్మహత్యకు ముందే ప్రణాళిక ప్రకారం అన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తెలుస్తోంది. పోలీసులు ఇంకా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన విషయాలు కూడా వెలుగులోకి రానున్నట్లు చెబుతున్నారు.
రాంచరణ్ భార్య ఉపాసన కూడా ప్రత్యూష ఆత్మహత్యపై విచారణ వ్యక్తం చేశారు. తనకు ప్రత్యూష ఓ మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చారు. ఫ్యాషన్ డిజైనర్ గా ప్రత్యూషకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. దీంతోనే ఆమె తన కెరీర్ ను ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. కానీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరాలు మాత్రం ఏమిటనే దానిపై ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది. ముందు నిర్ణయించుకున్న పథకం ప్రకారమే ఆమె బొటిక్ ను కూడా తయారు చేయించుకుంది.
పదిరోజుల క్రితమే వడ్రంగిని పిలిపించి బొటిక్ రూపకల్పనపై సూచనలు చేసింది. వాష్ రూం, ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేయించుకుంది. ఇంకా వాచ్ మెన్ అతడి భార్యను కూడా లోపలికి రానీయలేదు. ఏదైనా అవసరం వస్తే పిలుస్తానని చెప్పి వారిని బయటే ఉంచింది. దీంతో ప్రత్యూష ముందస్తు ప్రకారమే ఆత్మహత్య చేసుకోవడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని తెలుస్తోంది.
Also Read:Anushka Sharma: బీచ్ లో బికినీతో అనుష్క శర్మ వైరల్ ఫొటో