Prabhu Deva Ex-Wife: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన ప్రేమికుడు విఘ్నేష్ శివన్ ని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..మిత్రులు ,సన్నిహితులు మరియు కొంతమంది సినీ ప్రముఖుల మధ్య వీళ్లిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయాలతో ఘనంగా జరిగింది..వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..పెళ్ళైన రెండు రోజులకే ఈ జంట కొన్ని వివాదాలలోకి చిక్కుకుంది..తిరుమల లో శ్రీవారి దర్శనం చేసుకున్న ఈ జంట చెప్పులు వదలకుండా గుడి లోపలకు వెళ్లడం..అలాగే గుడి ప్రాంగణం లో ఈ ఇద్దరు ఫోటోషూట్ లు చెయ్యడం పెద్ద వివాదానికి దారి తీసింది..దీనిపై ఈ జంట క్షమాపణలు కూడా తెలిపింది..ఇది ఇలా ఉండగా నయనతార కి సంబందించి మరో విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఇక అసలు విషయానికి వస్తే విఘ్నేష్ తో ప్రేమలో పడేముందు అప్పట్లో శింబు మరియు ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం నడిపిన విషయం ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేదు..శింబు తో బ్రేకప్ అయిన తర్వాత ప్రభుదేవా తో ప్రేమలో పడిన నయనతార..చివరికి పెళ్ళికి కూడా సన్నాహాలు చేసుకుంది..అంత సజావుగా సాగుతుంది అని అందరూ అనుకుంటున్న సమయం లో వీళ్లిద్దరి పెళ్లి పీటలు వరుకు వచ్చి పెటాకులు అయ్యింది..వీళ్ళ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనే దాని పై ఇప్పటికి ఎలాంటి క్లారిటీ రాలేదు..కానీ ప్రభుదేవా మాజీ భార్య లత ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ప్రభుదేవా తన భార్య లత తో కలిసి 15 ఏళ్ళ దాంపత్య జీవితం కొనసాగించాడు..ఈ ఇద్దరి జంటకి ఒక్క కొడుకు కూడా ఉన్నాడు..అయితే నయనతార తో ప్రేమలో పడిన తర్వాత లత గారితో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు కలగనప్పటికీ కూడా కేవలం నయనతార ని పెళ్లి చేసుకోవడం కోసం లత కి విడాకులు ఇచ్చాడు ప్రభుదేవా..15 సంవత్సరాల మా దాంపత్య జీవితం లో ఎప్పుడు గొడవలు రాలేదు అని..మా జీవితాల్లోకి శని లాగ నయనతార ప్రవేశించింది అని..అప్పటి వరుకు నన్ను దేవతలా చూసిన నా భర్త ఈమె మాయలో పడి నా జీవితాన్ని రోడ్డు మీద పడేసాడు అని..లత గారు సంచలన ఆరోపణలు చేసారు..నాకు ఇంత అన్యాయం చేసిన నయనతార ని ఆ దేవుడు అంత తేలికగా వదిలిపెట్టడు అని..కచ్చితంగా తగిన శాస్తి చేస్తాడు అని తనలోని బాధ మరియు కోపం ని బయటపెట్టింది..నయనతార ఇప్పుడు నా కంటికి కనిపిస్తే కచ్చితంగా చెప్పుతో కొడతాను అని..నా కాపురం లో నిప్పులు పోసిన ఆ మనిషిని అంత తేలికగా వదలను అని లత గారు ఆరోపణలు చేసారు..ఆమె చేసిన వ్యాఖ్యలను చూసి సోషల్ మీడియా లో నెటిజెన్లు నయనతార పై విరుచుకుపడుతున్నారు..అప్పటికే పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్న ఒక్క వ్యక్తిని ఎలా ప్రేమించావు అంటూ నయనతార ని టాగ్ చేసి తిడుతున్నారు అభిమానులు..ఏది ఏమైనా ప్రభుదేవా గారి మాజీ భార్య లత కి చాలా అన్యాయం జరిగిండి అంటూ నెటిజెన్లు ఆమె పై సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు.