https://oktelugu.com/

Naga Shourya: ముదిరిన పేకాట దందా వివాదం… మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య అరెస్ట్

Naga Shourya: టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్ల లోని మంచిరేవుల ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్‌ కాలనీలోని ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌లో పేకాట నిర్వహిస్తున్నారు. ఈ కేసులో  30మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6.77 లక్షల నగదు, 33 మొబైల్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 1:23 pm
    Follow us on

    Naga Shourya: టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్ల లోని మంచిరేవుల ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్‌ కాలనీలోని ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌లో పేకాట నిర్వహిస్తున్నారు. ఈ కేసులో  30మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6.77 లక్షల నగదు, 33 మొబైల్‌ ఫోన్లు, 29 పేకాట సెట్లు, రెండు కాసినో కాయిన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

    shocking details revealed in naga shourya farm house rummy case

    ఈ ఇంటిని నాగశౌర్య నుంచి సుమన్‌ కుమార్‌ అనే అద్దెకు తీసుకొని పేకాటను నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే నాగశౌర్య బాబాయి బుజ్జి పేరు కూడా తెరపైకి వస్తుంది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్‌తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు. సుమన్‌కు నాగ శౌర్యకు మధ్య సంబంధాలపై విచారణ కొనసాగుతోంది.

    మరోవైపు సుమన్ ఫోన్‌ని పోలీసులు సీజ్ చేశారు. నగరానికి చెందిన 20 మంది ప్రముఖుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌ అగ్రిమెంట్‌ నాగశౌర్య తండ్రి పేరు మీద ఉండగా… శౌర్య బాబాయ్‌ బుజ్జి పాత్ర కూడా పేకాటలో ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమన్  ఫోన్‌ను, కాల్‌ డేటాను అనలైజ్ చేస్తున్న పోలీసులకు షాక్ అయ్యే నిజాలు తెలుస్తున్నాయి. ఈ ఒక్క ఫామ్‌హౌస్‌ లోనే కాకుండా  శివారుల్లోని వేర్వేరు ఏరియాల్లో వేర్వేరు ఫామ్‌హౌసుల్లో ఇదే దందా నడుపుతున్నాడని తెలుస్తోంది. ప్రతీ ఫామ్‌హౌస్‌కీ ఒక్కో వాట్సాప్‌ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం. ప్రతీ వాట్సాప్‌ గ్రూప్‌లో 200 మంది వరకూ జూదగాళ్లు ఉన్నారట. ఏపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల నంబర్లు కూడా అందులో ఉన్నాయని అనుకుంటున్నారు.