T20 World Cup : టీమిండియా ఓటమికి అసలు బాధ్యత బీసీసీఐదే?

T20 World Cup : పాకిస్తాన్ చేతిలో టీమిండియా  దారుణ పరాజయాన్ని ఎవ్వరూ ఊహించలేదు. న్యూజీలాండ్ ఇంత దారుణంగా చిత్తు చేస్తుందని కూడా ఎవ్వరూ కలగనలేదు. చివరకు ఆఫ్ఘనిస్తాన్ కన్నా వెనుకబడుతుందని అనుకోనే లేదు. ఇలాంటి చెత్త ఆటతో.. సెమీస్ రేస్ లో పూర్తిగా వెనుక బడింది భారత జట్టు. మరి, ఈ పరిస్థితికి కేవలం జట్టును మాత్రమే నిందించాలా? ఇందులో బీసీసీఐకి కూడా వాటా ఉందా? అన్నదే చర్చ. నిజానికి.. టైటిల్ ఫేవరెట్ గా బరిలో […]

Written By: Bhaskar, Updated On : November 1, 2021 1:09 pm
Follow us on

T20 World Cup : పాకిస్తాన్ చేతిలో టీమిండియా  దారుణ పరాజయాన్ని ఎవ్వరూ ఊహించలేదు. న్యూజీలాండ్ ఇంత దారుణంగా చిత్తు చేస్తుందని కూడా ఎవ్వరూ కలగనలేదు. చివరకు ఆఫ్ఘనిస్తాన్ కన్నా వెనుకబడుతుందని అనుకోనే లేదు. ఇలాంటి చెత్త ఆటతో.. సెమీస్ రేస్ లో పూర్తిగా వెనుక బడింది భారత జట్టు. మరి, ఈ పరిస్థితికి కేవలం జట్టును మాత్రమే నిందించాలా? ఇందులో బీసీసీఐకి కూడా వాటా ఉందా? అన్నదే చర్చ.

నిజానికి.. టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన టీమిండియా నుంచి ఎవ్వరూ ఇలాంటి ప్రదర్శన ఊహించలేదు. మరి, ఈ దారుణ పరాభవానికి గల కారణమేంటి అన్నప్పుడు? కనిపించేది తీరికలేని షెడ్యూల్. ఏ మాత్రం ఖాళీలేకుండా టీమిండియా క్రికెట్ ఆడటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు విష్లేషకులు.

వరల్డ్ టెటెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లండ్‌ వెళ్లిన భారత జట్టు.. ఆ తర్వాత అక్కడే ఉండి ఇంగ్లీష్ జట్టుతో అయిదు టెస్ట్ ల సిరీస్ ఆడింది. అది ముగియకుండానే.. యుఏఈలో వాలిపోయారు భారత ఆటగాళ్లు. నెలరోజులపాటు ఐపీఎల్ ఆడారు. ఆ టోర్నీ ముగియగానే.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ కు సిద్ధమయ్యారు. ఇలా.. బిజీ బిజీగా క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లు పైకి కనిపించని మానసిక, శారీరక అలసటకు గురవుతారు. ఈ అలసట.. అత్యుత్తమ జట్లతో పోటీ పడే వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలను తెస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగిందని అంటున్నారు పరిశీలకులు. మానసిక అలసట, ఒత్తిళ్లతోనే భారత్ ఆటగాళ్లు చిత్తయ్యారని అంటున్నారు.

దీంతోపాటు వరుసగా బయోబబుల్‌లో ఉండటం కూడా భారత ఆటగాళ్లను మానసికంగా కృంగ దీసిందనే అంటున్నారు. ఇంగ్లండ్ లో కరోనా కలకలం రేపడంతో మరింత జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉన్నారు. అక్కడి నుంచి టీ20 ప్రపంచకప్ వరకు మొత్తం బయో బబుల్ జీవితం గడపడం ఆటగాళ్లపై ఒత్తిడి పెంచిందనే చెప్పాలి. అంతకు ముందు ఇండియాలో సాగిన ఐపీఎల్ లోనూ బయో బబుల్ నే ఉన్నారు. ఇలా ఒంటరి జీవితాన్ని దీర్ఘ కాలం గడపడం కూడా ప్రభావం చూపి ఉండొచ్చు అంటున్నారు. కేవలం ధనాజనే ధ్యేయంగా.. బీసీసీఐ ఆడించిన క్రికెట్ కారణంగానే.. టీ20 వంటి టోర్నీలో భారత జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.