https://oktelugu.com/

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కు షాక్.. మళ్లీ రీష్యూట్?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్ర బృందం మరో న్యూస్ చెప్పింది. తమ టాకీ పార్ట్ పూర్తయ్యిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సినిమా పూర్తి కావడానికి మరో రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపింది. టాకీ భాగం పూర్తి చేయడానికి రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ రెండు మూడు రోజులు ఇటీవల దీనికోసం కేటాయించారు. అయితే కొన్ని సీన్లు అనుకున్నట్టు రాలేదని వాటిని రీష్యూట్ చేయడానికి మూడు రోజుల పాటు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2021 / 11:48 AM IST
    Follow us on

    దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్ర బృందం మరో న్యూస్ చెప్పింది. తమ టాకీ పార్ట్ పూర్తయ్యిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సినిమా పూర్తి కావడానికి మరో రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపింది.

    టాకీ భాగం పూర్తి చేయడానికి రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ రెండు మూడు రోజులు ఇటీవల దీనికోసం కేటాయించారు. అయితే కొన్ని సీన్లు అనుకున్నట్టు రాలేదని వాటిని రీష్యూట్ చేయడానికి మూడు రోజుల పాటు మరోసారి రాజమౌళి షూటింగ్ చేయడానికి తిరిగి సెట్స్ వద్దకు చేరుకున్నారని టాక్.

    వచ్చే వారం ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణకు ముందు రాజమౌళి ఇప్పుడు ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తున్నారు. అది పూర్తయితే ఇక మొత్తం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ అయినట్టేనట..

    ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. భారతదేశంలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ పిరియాడిక్ డ్రామాపై బోలెడు అంచనాలున్నాయి.

    ఇప్పటికే ఇటీవల విడుదలైన ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ వీడియో వైరల్ ా మారింది. అది యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.