https://oktelugu.com/

నీళ్లపై హక్కులు లేకుండా చేసిందెవరు?

తెలుగు స్టేట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జలవివాదాల నేపథ్యంలో కేంద్రం ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకుంది కృష్ణా, గోదావరి నది పరిధిలోని 107 ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంది. చివరికి ప్రకాశం బ్యారేజీ కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్లింది. నదులపై సర్వహక్కులు కేంద్రం సొంతమే. ఇప్పుడు చుక్క నీరు కూడా సొంతంగా వాడుకోవడానికి వీలు కాదు. ఏదైనా బోర్డు కేటాయించాల్సిందే. వారు విడుదల చేస్తేనే వాడుకోవచ్చు. కృష్ణా గోదావరి బోర్డులకు సర్వాధికారాలు కేంద్రం అప్పగించింది. నిర్వహణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 17, 2021 12:04 pm
    Follow us on

    Water Disputeతెలుగు స్టేట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జలవివాదాల నేపథ్యంలో కేంద్రం ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకుంది కృష్ణా, గోదావరి నది పరిధిలోని 107 ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంది. చివరికి ప్రకాశం బ్యారేజీ కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్లింది. నదులపై సర్వహక్కులు కేంద్రం సొంతమే. ఇప్పుడు చుక్క నీరు కూడా సొంతంగా వాడుకోవడానికి వీలు కాదు. ఏదైనా బోర్డు కేటాయించాల్సిందే. వారు విడుదల చేస్తేనే వాడుకోవచ్చు.

    కృష్ణా గోదావరి బోర్డులకు సర్వాధికారాలు కేంద్రం అప్పగించింది. నిర్వహణ ఖర్చుల్ని మాత్రం రాష్ర్ట ప్రభుత్వాలపై వేసింది. ఇప్పుడు ఒక్క టీఎంసీ నీరు కావాలన్నా కేంద్రాన్ని బతిమాలుకోవాల్సిందే. బోర్డుల వద్దకు పరుగెత్తాల్సిందే. బోర్డులు ఎలా పని చేస్తాయో చెప్పాల్సిన అవసరం లేదు. బోర్డుల్లో తెలుగు వారెవరు ఉండకపోవడంతో పనులు అంత తేలిగ్గా కావు. తెలుగు ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తులు ఉండడంతో పనులు చేయించుకోవడం కష్టమే. వారికి ఇక్కడి సమస్యలు తెలియవు.

    రెండు స్టేట్ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కలిసి మాట్లాడుకుంటే పోయే సమస్యను తెగేదాకా లాగారు. గోటి తోటి పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడమంటే ఇదే. సమస్యను పెద్దది చేసుకుని కేంద్రం తలుపు తట్టారు. ఫలితం మారింది. పరిస్థితిని కేంద్రం అనుకూలంగా మార్చుకుంది. రెండు స్టేట్ల అధికారాలు లాగేసుకుంది. రెండు ప్రాంతాలకు షాక్ తగిలింది. తెలంగాణ బోర్డులను నోటిపై చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. అవసరం అయితే న్యాయపోరాటం చేయాలని అనుకుంటోంది.

    కానీ ఎవరేం చేసినా విభజన చట్టం ప్రకారం బోర్డుల్ని నోటిఫై చేసినందున కోర్టుల్లో కూడా నిలవదని న్యాయనిపుణులు చెబుతున్నారు. తెలుగు ప్రాంతాలు ప్రాజెక్టులపై కీలకమైన హక్కులు కోల్పోయాయి. ఇప్పుడు చేయడానికి ఏం లేదు ఏ చిన్న అవసరం వచ్చినా నీళ్లు కావాలంటూ కేంద్రం ఆధీనంలో ఉన్న కృష్ణా, గోదావరి బోర్డుల వద్దకు పరుగెత్తాలి. ఏటా రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు అంతకుమించి వేరే దారి లేదు.