Homeఎంటర్టైన్మెంట్OkTelugu Movie Time: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్...

OkTelugu Movie Time: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

OkTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీలోని ‘ఆరబిక్ కుతు’ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన 4 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్, వారం రోజుల్లో 70 మిలియన్ వ్యూస్, తాజాగా 12 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ దాటింది. 3.7 మిలియన్స్‌కు పైగా లైక్స్ సాధించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా.. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

OkTelugu Movie Time
Thalapathy Vijay Beast Movie

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘DJ టిల్లు’ ఈనెల 12న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సినీ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. అయితే ఈ సినిమా ఓటీటీ వేదిక ‘ఆహా’లో మార్చి 10 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు థియేటర్స్ దద్దరిల్లాయి.

OkTelugu Movie Time
DJ Tillu

మరో అప్ డేట్ ఏమిటంటే.. హిట్ టాక్‌తో భీమ్లానాయక్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాను చూసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. మూవీని చూడాలని సీఎం జగన్‌ను కోరారు. ‘విజయవాడలో భీమ్లానాయక్ చూశా. సినిమా సక్సెస్‌ను అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించిన వైసీపీ సర్కారుకు భారీ విజయం షాకిస్తోంది.

Also Read: సీపీఐ నారాయణను చెప్పుతో కొడుతానన్న తమన్నా.. హాట్ కామెంట్స్ వైరల్

OkTelugu Movie Time
Pawan Kalyan and Rana Daggubati Bheemla Nayak

రాజకీయాలు పక్కన పెట్టి భీమ్లానాయక్‌ను జగన్ గారు చూడాలి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది సీఎం గారు’ అని GVL చెప్పారు. మరి GVL చెప్పినట్టు జగన్ సినిమా చూస్తాడా !

Also Read: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్లు ఎవరు ? వాళ్ళు ఎలా ఎంట్రీ ఇచ్చారు ?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version