https://oktelugu.com/

Krishnamraju : కేవలం ఒక్క హీరోయిన్ తోనే 70 సినిమాలు..కృష్ణంరాజు కి ఆమె అంటే అంత ఇష్టం ఎందుకు? Krishnamraju : కేవలం ఒక్క హీరోయిన్ తోనే 70 సినిమాలు..కృష్ణంరాజు కి ఆమె అంటే అంత ఇష్టం ఎందుకు? 

కృష్ణం రాజు గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాధారణంగా ఒక హీరో , హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తేనే వాళ్ళ మధ్య ఎదో జరుగుతుందని, ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని ఇలా ఎన్నో రకాల పుకార్లు పుట్టిస్తారు. అలాంటిది కృష్ణం రాజు ఒక హీరోయిన్ తో ఏకంగా 70 నుండి 80 సినిమాలు నటించాడు

Written By:
  • Vicky
  • , Updated On : September 11, 2024 / 09:04 PM IST

    Krishnamraju-Jaya sudha

    Follow us on

    Krishnamraju :  స్వర్ణ యుగానికి సంబంధించిన సూపర్ స్టార్స్ అందరినీ మన తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. వారిలో కృష్ణం రాజు గారు కూడా ఉన్నాడు. సినీ పరిశ్రమకి ఈయన చేసిన సేవలు వెలకట్టలేనిది. చిత్ర పరిశ్రమ చిరకాలం లైబ్రరీ లో పదిలంగా దాచుకునే అద్భుతమైన సినిమాలను ఎన్నో కృష్ణం రాజు అందించాడు. విలన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని రెబెల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. సుమారుగా ఆయన 200 కు పైగా చిత్రాల్లో నటించాడు. చివరి వరకు సినిమాల్లోనే కొనసాగాలి అనే ఆయన ఆశ కూడా నెరవేరింది. ఆయన చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘రాధే శ్యామ్’. కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయంగా కూడా కృష్ణం రాజు వేసిన ముద్ర మామూలుది కాదు. ఎంపీ గా , మంత్రిగా ఆయన ఎన్నో సేవలు అందించాడు.

    ఇదంతా పక్కన పెడితే కృష్ణం రాజు గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాధారణంగా ఒక హీరో , హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తేనే వాళ్ళ మధ్య ఎదో జరుగుతుందని, ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని ఇలా ఎన్నో రకాల పుకార్లు పుట్టిస్తారు. అలాంటిది కృష్ణం రాజు ఒక హీరోయిన్ తో ఏకంగా 70 నుండి 80 సినిమాలు నటించాడు అనే విషయం చెప్తే మీరు నమ్ముతారా?, కానీ అది నిజమే, ఆయన అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధ తో కలిసి దాదాపుగా 80 సినిమాల్లో నటించాడట. శ్రీదేవి, జయప్రద ఇలా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ, కృష్ణం రాజు ఎక్కువగా జయసుధ తోనే సినిమాలు చేసేవాడట. ఆమె అంటే ఆయనకు అంత ఇష్టం. కేవలం హీరో గా కొనసాగుతున్నప్పుడు మాత్రమే కాదు, కృష్ణంరాజు క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేసినప్పుడు కూడా ఆయనకీ జోడీ గా జయసుధ ఉండేది. ఆమెతో కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరేదని, మా కాంబినేషన్ చాలా సహజంగా ఉండేదని, అభిమానులు పదే పదే కోరుకోవడం వల్లే నా ప్రతీ సినిమాలోనూ జయసుధ ని హీరోయిన్ గా తీసుకునేవాడిని అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు కృష్ణం రాజు. అంతేకాదు జయసుధ ఆయనకి ఫేవరెట్ హీరోయిన్ కూడా.

    తన కుటుంబానికి మంచి స్నేహితురాలిగా, ఇంకా చెప్పాలంటే తన కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయింది కృష్ణం రాజు ఎన్నో సందర్భాలలో చెప్పాడు. అయితే ఇన్ని సార్లు కలిసి నటించారు కదా, మీ మీద అప్పట్లో చాలా రూమర్స్ వచ్చి ఉంటాయే అని ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా, వచ్చాయి కానీ మేము పట్టించుకోలేదు. నాకు జయసుధ సోదరి లాంటిది, ఆమె నన్ను ఇప్పటికీ అన్నయ్య అనే పిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణం రాజు. వీళ్ళిద్దరూ కలిసి జంటగా ప్రభాస్ బిల్లా సినిమాలో కూడా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.