Homeఎంటర్టైన్మెంట్Shobhan Babu : శోభన్ బాబు చివరి రోజుల్లో కోరుకుంది అదే, అందుకే పవన్, మహేష్...

Shobhan Babu : శోభన్ బాబు చివరి రోజుల్లో కోరుకుంది అదే, అందుకే పవన్, మహేష్ బాబును కూడా తిరస్కరించాడు, ఇంట్రెస్టింగ్ స్టోరీ

Shobhan Babu : ఎన్టీఆర్, ఏఎన్నార్ అనంతరం తెలుగులో స్టార్ హీరోగా ఎదిగారు శోభన్ బాబు. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఒక తరం హీరోలు. శోభన్ బాబు హ్యాండ్సమ్ హీరోగా తనకంటూ సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా శోభన్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఉండేది. పలు హిట్స్, బ్లాక్ బస్టర్ చిత్రాల్లో శోభన్ బాబు నటించారు. మల్టీస్టారర్స్ చేశారు. 90ల తర్వాత శోభన్ బాబు కెరీర్ నెమ్మదించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల హవా మొదలయ్యాక పాత తరం హీరోలు రేసులో వెనుకబడ్డారు.

1996లో శోభన్ బాబు నటనకు గుడ్ బై చెప్పారు. మరలా ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అయితే శోభన్ బాబుకు పలు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయట ఆయన చేయను అన్నారట. నా అభిమానులకు, ప్రేక్షకులకు నేను హీరోగా తెలుసు. హీరో అనే ఇమేజ్ తోనే నేను రిటైర్ కావాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే గుర్తింపు కోరుకోవడం లేదని శోభన్ బాబు పలు చిత్రాలు తిరస్కరించారు. వాటిలో అన్నమయ్య ఒకటి. దర్శకుడు రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన అన్నమయ్య ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో సుమన్ చేసిన వెంకటేశ్వర స్వామి పాత్రకు శోభన్ బాబును రాఘవేంద్రరావు సంప్రదించాడట.

Also Read : శోభన్ బాబు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వస్తే చాలు అనుకున్న హీరోయిన్స్ వీళ్లేనా..?

పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ లో చేసిన సూపర్ హిట్ మూవీ సుస్వాగతం. భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడు. సుస్వాగతం మ్యూజికల్ హిట్. ట్రాజిక్ లవ్ స్టోరీతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్ ప్రధానంగా సుస్వాగతం తెరకెక్కింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తండ్రిగా రఘువరన్ నటించారు. రఘువరన్ చేసిన హీరో ఫాదర్ రోల్ శోభన్ బాబుతో చేయించాలని దర్శకుడు అనుకున్నాడట. ఈ పాత్రను కూడా శోభన్ బాబు తిరస్కరించారట. మంచి నటుడైన రఘువరన్ ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు.

మహేష్ బాబు కెరీర్లో అతడు చాలా స్పెషల్ మూవీ. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కించుకుంది. థియేటర్స్ లో పెద్దగా ప్రభావం చూపని ఈ మూవీ బుల్లితెరపై సంచలనాలు చేసింది. ఎప్పుడు అతడు మూవీ ప్రసారమైన విసుగు లేకుండా ఆడియన్స్ చూస్తారు. ఈ మూవీలో హీరో తాతయ్య పాత్రను నాజర్ చేశారు. ఈ పాత్రకు శోభన్ బాబును అనుకున్నారట. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో నాజర్ తో చేయించారు త్రివిక్రమ్. తన పిల్లలను కూడా సినిమా పరిశ్రమకు దూరంగా పెంచిన శోభన్ బాబు 2008లో 71 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.

Also Read : పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా?

RELATED ARTICLES

Most Popular