Shobhan Babu: ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్టీయార్, నాగేశ్వరరావు లాంటి హీరోలు వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ పెద్దలుగా వాళ్లే వ్యవహరించేవారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి సొల్యూషన్ వాళ్లే చూపించేవారు. అలా వాళ్ళు పీక్ స్టేజ్ లో స్టార్ హీరోలుగా ఉన్నప్పుడు కృష్ణ , శోభన్ బాబు లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగారు.
ఇక ఎన్టీఆర్, నాగేశ్వరరావు బాటలోనే వీళ్లు కూడా మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇక ఇదిలా ఉంటే శోభన్ బాబు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువగా దగ్గరయ్యే సినిమాలను చేస్తూ ప్రతి ఫ్యామిలీ లో ఒక మెంబర్ గా మారిపోయాడు. అందుకే శోభన్ బాబు సినిమా వస్తుందంటే థియేటర్లు మొత్తం లేడీస్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ తో నిండిపోయేవి. ఆయన వాళ్లకు తగ్గట్టుగానే గోరింటాకు, దేవత లాంటి మంచి ఫ్యామిలీ సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలుగా చేసేవాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు శోభన్ బాబు సినిమాలో అవకాశం వచ్చిందంటే చాలు హీరోయిన్స్ ఎగిరి గంతేసేవారు. ఎందుకంటే అప్పటివరకు హీరోయిన్లకు ఎలాంటి ఇమేజ్ ఉన్నా కూడా ఒక్కసారి శోభన్ బాబు సినిమాలో నటించారు అంటే ఆ హీరోయిన్లకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అయితే ఏర్పడేది.
అందుకే శోభన్ బాబు పక్కన నటించడానికి చాలా మంది స్టార్ హీరోయిన్స్ సైతం ఎదురుచూసేవారు. ఇక ఆయన పక్కన హీరోయిన్ గా నటించిన వాళ్లలో జయసుధ, జయప్రద, సుజాత, శారద, శ్రీదేవి, వాణిశ్రీ లాంటి హీరోయిన్లు ముందు వరుస లో ఉన్నారు. వీళ్లు శోభన్ బాబు పక్కన హీరోయిన్లు గా చేసిన తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యారు. అయితే వీళ్ళు శోభన్ బాబు తో నటించే అవకాశం ఎప్పుడు వస్తుంది అని చాలా రోజులపాటు ఎదురు చూశారట..
క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమాలు ఎలా ఉంటాయో శోభన్ బాబు సినిమాలు అలానే ఉంటాయి. ఎక్కడ కూడా వల్గారిటీ గానీ, డబల్ మీనింగ్ డైలాగులు గాని ఏవీ లేకుండా చాలా క్లీన్ గా ఉండే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. అందువల్లే శోభన్ బాబుకి ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి హీరోయిన్లు కూడా ఆయన సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూసేవారు…