Nayanthara: రజినీకాంత్ ‘సూపర్ స్టార్’ బిరుదు హైజాక్ వివాదంపై స్పందించిన నయనతార…షాకింగ్ కామెంట్స్…

తమిళంలో మాత్రం ఒక రజనీకాంత్ కి సూపర్ స్టార్ అనేది అంకితం అయిందనే చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న నయనతారని తమిళంలో లేడీ సూపర్ స్టార్ అంటూ పొగుడుతూ ఉంటారు.

Written By: NARESH, Updated On : December 10, 2023 12:07 pm

Nayanthara

Follow us on

Nayanthara: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ సూపర్ స్టార్ గా చాలా సంవత్సరం నుంచి వెలుగొందుతున్నారు. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా రజనీకాంత్ కు భారీ మార్కెట్ అయితే ఉంది.తెలుగులో కూడా ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తమిళ్ తోపాటు గా ఇక్కడ కూడా ఆయనకి అదే రేంజ్ లో ఫ్యాన్స్ ఉండటం అనేది విశేషం…అయితే ఆయన తమిళ్ లో సూపర్ స్టార్ అని బిరుదుతో అతని ఫాన్స్ పిలుస్తూ ఉంటారు. ఇక తెలుగులో అయితే సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ మనం వీళ్ళిద్దరికీ అదే ట్యాగ్ ని తగిలించి పిలుస్తూ ఉంటాం…

కానీ తమిళంలో మాత్రం ఒక రజనీకాంత్ కి సూపర్ స్టార్ అనేది అంకితం అయిందనే చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న నయనతారని తమిళంలో లేడీ సూపర్ స్టార్ అంటూ పొగుడుతూ ఉంటారు. అలా నయనతార కి ట్యాగ్ ఇవ్వడం పట్ల రజనీకాంత్ అభిమానులు చాలా ఇబ్బందిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక మొన్నటిదాకా లేడీ సూపర్ స్టార్ అని మాటల్లో చెప్పేవారు కానీ ఇప్పుడు స్క్రీన్ పైన లేడీ సూపర్ స్టార్ అంటూ నయనతార ముందు ఒక ట్యాగ్ ని తగిలించి వేయడం అనేది రజనీకాంత్ అభిమానులను తీవ్ర నిరాశ కి గురిచేస్తుంది. ఎందుకంటే తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఒక్కరే అది రజనీకాంత్ మాత్రమే అంటూ అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు…

అయితే ఇదే ట్యాగ్ ని కొద్ది రోజులు ముందు నుంచి కూడా విజయ్ కి ఆడ్ చేయాలని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు కానీ రజినీకాంత్ అభిమానులు మాత్రం సూపర్ స్టార్ అనేది ఒక రజనీకాంత్ కు మాత్రమే సొంతం అంటూ ఎప్పటికప్పుడు విజయ్ ఫ్యాన్స్ ని తిప్పి కొడుతున్నారు. ఇక ఇప్పుడు నయనతార రజనీకాంత్ అభిమానులను ఎదిరించి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను వేసుకోవడం పట్ల రజిని అభిమానులు తీవ్ర నిరాశనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా అన్నపురాణి అనే సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న నయనతార లేడీ సూపర్ స్టార్ వివాదం మీద స్పందించారు.

నాకు పేర్లకు ముందు ట్యాగ్ లు తగిలించుకోవడం అంటే ఇష్టం ఉండదు.కానీ మా డైరెక్టర్ నాకు తెలియకుండానే ఆ ట్యాగ్ ని ఆడ్ చేసి స్క్రీన్ మీద పెట్టేశారు అది నాకు తెలియకుండానే జరిగింది. దీనివల్ల నన్ను 10 మంది పొగుడుతుంటే 100 మంది తిడుతున్నారు. ఇలాంటివి నాకొద్దు నన్ను నాలా ఉండనివ్వండి అంటూ తను వివాదం పైన స్పందించి దానికొక తెరదించారనే చెప్పాలి…