Megastar Sister: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పై ఇప్పటికే రోజుకొక రూమర్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ శోభన నటించబోతుందని తెలుస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ ఉన్న శోభన.. సినిమాలకు దూరంగా తన జీవితాన్ని పూర్తిగా నాట్యానికే పరిమితం చేసుకుంది. అయితే గత ఏడాది నుంచి శోభన నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. మలయాళంలో శోభన ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమెకు మెగా పిలుపు అందింది అని, కాబట్టి గాడ్ ఫాదర్ లో ఒక ప్రత్యేక పాత్రలో ఆమె కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. అయితే ఆమె ఏ పాత్ర చేయబోతుంది ? ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయా ? లేక పక్కా ఎమోషనల్ పాత్రలో శోభన కనిపించబోతుందా ? అనేది చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే.. మలయాళ వెర్షన్ లో ‘మంజు వార్యర్’ పాత్రనే తెలుగులో శోభన చేయబోతోందట.
ఈ పాత్ర హీరోకి చెల్లి పాత్ర. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నిజానికి తెలుగు వర్షన్ లో ఈ పాత్రలో బాలీవుడ్ నటి ‘విద్యా బాలన్’ నటించబోతున్నట్లు ఆ మధ్య బాగా వినిపించింది. ఆ తర్వాత కుష్బూ పేరు వినిపించింది. ఇప్పుడు శోభన పేరు వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఒక్క పాత్ర పైనే ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి.
మొదట్లో సుహాసిని కూడా నటిస్తోంది అన్నారు, అన్నట్టు మధ్యలో అనసూయ కూడా నటిస్తోంది అన్నారు. చివరకు శోభన పేరును ఫైనల్ చేశారు మేకర్స్. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ ఈ సినిమాలో వెరీ స్టైలిష్ గా కనిపించనున్నారు.