నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ ఇకలేరు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గత కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిర్మాతగా ఆయన సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య వంటి పలు చిత్రాలు నిర్మించారు.

‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పింది. వరుణ్ తేజ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో రానున్న కొత్త సినిమాలో హీరోయిన్ కృతిని ఫైనల్ చేశారు చిత్రబృందం. ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలలో నటిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఇప్పటికే అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమాలో కూడా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.
తెలుగు అమ్మాయి అయినా.. తమిళంలో పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ చాలా విషయాలు చెప్పింది. ‘గత హీరోయిన్లను తీసుకుంటే తనకు సౌందర్య అంటే బాగా ఇష్టం అని, ఇక ఇప్పటి హీరోయిన్లలో సమంత అంటే ఇష్టం అని, ఆమె అటు గ్లామర్ పాత్రలని, ఇటు అభినయంతో కూడిన పాత్రలని సమంత బాగా చేస్తుందని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
నేషనల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్ ఈ రోజుతో ప్రస్తుత షెడ్యూల్ ముగుస్తుందని తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. అందుకే తన లుక్ కోసం ప్రభాస్ వచ్చే వారంలో యూకేకు వెళ్ళబోతున్నాడు.
‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న ‘ఆచార్య’ సినిమా జనవరి 7వ తేదీ రిలీజ్ చేయాలని మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.