Jailer 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) లాంటి నటుడు సైతం తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. తద్వారా ఆయనకు ఇక్కడ కూడా చాలా మంచి మార్కెట్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో వస్తున్న పెద్ది (Peddi) సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తను ఉపేంద్ర తో కలిసి నటించిన ’45’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఈవెంట్లో పెద్ది సినిమాకు సంబంధించిన విషయాల గురించి చెప్పాడు. బుచ్చిబాబు, రామ్ చరణ్ చాలా మంచి సన్నిహితులని వాళ్లతో వర్క్ చేయడం నిజంగా తన అదృష్టం అంటూ ఆయన చెప్పడం విశేషం…ఇక అక్కడున్న రిపోర్టర్ మీరు జైలర్ 2 (Jailer 2) సినిమాలో బాలయ్య బాబు(Balayya Babu) తో కలిసి నటిస్తున్నారట అని ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. దానికి శివ రాజ్ కుమార్ నవ్వుతూ జైలర్ 2 లో నేనైతే నటిస్తున్నాను మరి బాలయ్య బాబు చేస్తున్నారా లేదా అనే విషయం మీద నాకైతే క్లారిటీ లేదు అంటూ అసలు విషయాన్నీ చెప్పకుండానే తప్పించుకున్నారు.
Also Read : జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ‘జైలర్ 2’..ఈ వయస్సులో అదేమీ దూకుడు సామీ!
మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోల్లో శివరాజ్ కుమార్ కూడా ఒకరు కావడం విశేషం… ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
మరి ఇలాంటి క్రమంలోనే శివరాజ్ కుమార్ హీరోగా రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ చిన్న క్యామియో రోల్ చేసి ఆ సినిమా మీద హైప్ ని పెంచిన విషయం మనకు తెలిసిందే. ఇక జైలర్ 2(Jailer 2)సినిమాలో కూడా ఆయన ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది ఆయనతో పాటు బాలయ్య బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారా?లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్న తెలుగు స్టార్ హీరో…