Nani : కెరియర్ మొదట్లో కామెడీ, ఫ్యామిలీ సినిమాలను చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నాని గత కొన్ని సినిమాల నుంచి మాస్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాని చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూసేవారు…కానీ ఇప్పుడు ఆయన ఫ్యామిలీ సినిమాలు చేయకుండా దూరమైపోతున్నారనే చెప్పాలి.
నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు నాని(Nan)… అష్టా చమ్మ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. మన పక్కింటి కుర్రాడిలా అనిపించే నాని ప్రతి ఒక్కరికి నచ్చడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మాస్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దసర (Dasara) సినిమాతో మాస్ హీరోగా మారిన ఆయన ప్రస్తుతం హిట్ సినిమాతో ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. మరి ఆయన చేస్తున్న ఈ సినిమాలు ఆయనకి భారీ గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయనను మాస్ హీరోగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక హిట్ 3 సినిమాలో కనక చూసినట్లయితే అందులో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందంటూ నాని చాలా ఓపెన్ గా చెప్పాడు. చిన్న పిల్లలతో ఈ సినిమా చూడకండి అని కూడా చెప్పాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకొని సినిమాలు చేసేవాడు.
Also Read : అల్లు అర్జున్ బాటలోనే నాని నడుస్తున్నాడా..?
అలాంటిది ఇప్పుడు వైలెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తన సినిమాలను చూసే అవకాశం లేకుండా పోతుందా? అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వెళ్ళడవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా నాని లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
కాబట్టి ఇప్పుడు ఆయన మాస్ సినిమాలు చేయడం కంటే కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు చేస్తేనే బాగుంటుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా నాని వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటాడా? తద్వారా ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ సినిమా తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ (Paradaiase) సినిమా సైతం భారీ మాస్ సినిమాగా తెరకెక్కడమే కాకుండా అదొక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతుంది మరి ఆ సినిమాని సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆదరించే అవకాశాలైతే లేవు. ఇక మెల్లిమెల్లిగా నాని ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం అయిపోతున్నాడు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : ‘హిట్ 3′ ట్రైలర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు!