Shivam Bhaje Movie Review: ‘శివం భజే’ ఫుల్ మూవీ రివ్యూ…

ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలు అయితే అందుకుంటూ వస్తున్నాడు. ఇక తను హీరోగా అప్సర్ డైరెక్షన్ లో చేస్తున్న 'శివం భజే' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Written By: Gopi, Updated On : August 2, 2024 10:12 am

Shivam Bhaje Movie Review

Follow us on

Shivam Bhaje Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి సినిమా కథలు మారిపోయాయి. ఒకప్పుడు మూస ధోరణిలో చాలా కథలు వచ్చి ప్రేక్షకులను కొంత వరకు ఇబ్బందులకు గురి చేసేవి…కానీ ఇప్పుడు సినిమాలు కూడా చాలా కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయా దర్శక నిర్మాతలకు మంచి కలెక్షన్లను కూడా సాధించి పెడుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలు అయితే అందుకుంటూ వస్తున్నాడు. ఇక తను హీరోగా అప్సర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘శివం భజే’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడికి నచ్చిందా? లేదా? అశ్విన్ ‘రాజు గారి గది’ సినిమా తర్వాత ఈ సినిమాతో మళ్లీ మంచి సక్సెస్ ను అందుకున్నాడా లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అశ్విన్ బాగా చదువుకొని ఒక జాబ్ చేసుకుంటూ బతికే ఒక కుర్రాడు ఇక అనుకోకుండా అతని లైఫ్ లోకి దిగంగన సూర్య వంశీ వస్తుంది. ఇక వీరిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు అయితే అనుకోకుండా ఒక రోజు అశ్విన్ బాబుకి మిగతా కొంతమందికి గొడవ జరుగుతుంది. అందులో ఆ రౌడీలు చేసిన ఒక పనికి అశ్విన్ చూపు కోల్పోతాడు. హాస్పిటల్ కి వెళ్లిన అశ్విన్ బాబుకి డాక్టర్లు సర్జరీ చేసి వేరే కండ్లను పెడతారు. అయితే ఆ కండ్లు ఒక కుక్క కండ్లు కావడం విశేషం…ఆ కుక్క పోలీస్ డాగ్ గా కూడా చేస్తుంది. మరి ఆ కుక్క కండ్లు ను అశ్విన్ బాబుకి ఎందుకు పెట్టారు.ఈ సినిమాలో చైనా, పాకిస్తాన్ లతో అశ్విన్ బాబుకి ఉన్న సంబంధం ఏంటి ముఖ్యంగా హిందువుల ఆరాధ్య దైవమైన శివుడికి అశ్విన్ కి మధ్య సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు మొదటి నుంచి చాలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కథ అయినప్పటికీ అప్సర్ తన దర్శకత్వ ప్రతిభను చూపిస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించే సన్నివేశం లేకుండా జాగ్రత్త పడ్డాడు. లవ్ స్టోరీ తో ముందుకు సాగించిన అప్సర్ సెకండ్ హాఫ్ మీద మాత్రం చాలా ఎక్కువగా వర్క్ చేశాడు… సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా టైట్ గా రాసుకోవడం వల్ల మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి…

ఇక దాంతోపాటుగా ఆయన చెప్పే కొన్ని విషయాలను సీన్ల ద్వారా ప్రేక్షకుడికి కన్వే చేసే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా దర్శకుడు తను ఏ సినిమా చేస్తున్నాడు అనే దానిమీద ఒక క్లారిటీ అయితే ఉండాలి. లేకపోతే మాత్రం ఆ దర్శకుడు ఏం చేస్తున్నాడు అనేది ఒక గమ్యం లేకుండా ముందుకు సాగుతుంది… ఒక మొత్తానికైతే అప్సర్ ఈ సినిమాని చివరి వరకు చాలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు తీసుకెళ్లడంలో కొద్ది వరకు సక్సెస్ అయితే సాధించాడు. అయితే ఫస్టాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి.

ఇక చివర్లో లార్డ్ శివయ్యను చూపించిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. అశ్విన్ కి పాకిస్తాన్ చైనాలకి దేవుడికి మధ్య ముడిపెట్టిన సీన్స్ చాలా వర్కౌట్ అయ్యాయి. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా అశ్విన్ బాబుకి ఒక మంచి సినిమాగా నిలుస్తుందనే చెప్పాలి… ఇక మ్యూజిక్ కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో చాలా వరకు ప్లస్ అయింది. ఆ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండటం వల్ల ఎమోషనల్ గా ప్రేక్షకుడికి చాలా వరకు కనెక్ట్ అయ్యాయి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆఫీసులో పర్ఫామెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ లో నటించిన అశ్విన్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాతో కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేశాడు. ఇక తను కెరియర్ లో మొదటి నుంచి కూడా డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో కూడా వైవిధ్యమైన నటనను కనబరుస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని సీన్లలో ఆయన చేసిన నటన చాలా ఎక్స్ స్ట్రా ఆర్డినరీ గా ఉందనే చెప్పాలి. ఆయన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి…

ఇక హీరోయిన్ దిగంగన సూర్యవంశీ విషయానికి వస్తే ఆమె తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. ఇక గ్లామర్ టచ్ ఇస్తూనే ఆమె నటన పరంగా కూడా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది…ఇక హైపర్ ఆది లాంటి కమెడియన్స్ ఈ సినిమాలో కొద్ది వరకు కామెడీతో ఎంటర్ టైన్ చేశారు. కానీ వీళ్ళ కామెడీ ఇంకా కొంచెం ఎక్కువ లెంతిగా ఉంటే బాగుండేది అనిపించింది… ఇక బాలీవుడ్ నటుడు అయిన అర్బాజ్ ఖాన్ కూడా ఒక మంచి పాత్రలో నటించి పాత్రకు న్యాయం చేశాడు. అలాగే తనికెళ్ల భరణి, మురళీ శర్మల, బ్రహ్మాజీ లాంటి నటులు సెటిల్డ్ పర్ఫామెన్స్ ను ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఒకే అనిపించేలా చేశారు..

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ ఇచ్చిన మ్యూజిక్ అంత పర్ఫెక్ట్ గా లేకపోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కొద్ది వరకు ఓకే అనిపించింది. ఇక సెకండాఫ్ లో వచ్చిన కొన్ని మేజర్ సీన్స్ లో ఎమోషన్ ని ప్రేక్షకుడికి హుక్ చేయడంలో మాత్రం ఆయన కొద్ది వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఇక ఎడిటర్ చోట కే ప్రసాద్ ఇంకా కొంచెం బెటర్ గా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఆ లాగ్ సీన్స్ ను కొంచెం షార్ప్ గా చేస్తే సినిమా ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేది…

ప్లస్ పాయింట్స్

అశ్విన్ యాక్టింగ్…
సెకండాఫ్ లో వచ్చే ట్విస్టు లు
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్

బోరింగ్ సీన్స్
కామెడీ దోస్ తగ్గింది…

రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.25/5

చివరి లైన్
ఖాళీగా ఉంటే వీకెండ్స్ లో ఒక్కసారి చూడచ్చు…