Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఎటువంటి అంచనాలు లేకుండా నటుడు శివాజీ ఎంట్రీ ఇచ్చారు. అయితే అతనికి బయట పొలిటికల్ గా చాలా నెగిటివిటీ ఉంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన శివాజీ ఇంత కాలం లోపల ఉండగలడు అని ఎవ్వరూ ఊహించలేదు. వయసు రీత్యా ఆయన ఏమి ఆడగలడు అని అంతా అనుకున్నారు. శివాజీ తనదైన శైలిలో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. టాప్ 6 ఫైనలిస్టులలో ఒకడిగా నిలిచాడు.
అయితే ఈ ఆరుగురిలో ఒకరు విన్నర్ కాబోతున్నారు. గ్రాండ్ ఫినాలే షూటింగ్ నుండి కొంత కీలక సమాచారం బయటకు వచ్చింది. దాని ప్రకారం నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ముందు అర్జున్ ఆరో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న యావర్ 15 లక్షలు తీసుకుని బయటకు వచ్చాడు. తర్వాత శివాజీ టాప్ 3 లో ఎలిమినేట్ అయ్యారు.
కాగా శివాజీ సీజన్ 7 విజేతగా నిలుస్తాడు అని అందరూ భావించారు. ఫ్యామిలీ వీక్ తర్వాత అంతా రివర్స్ అయింది. శివాజీకి వరుసగా నెగిటివ్ ఎపిసోడ్స్ పడటంతో .. అమర్ గ్రాఫ్ పెరిగిపోయింది. దీంతో టైటిల్ చేజారిపోయింది. అయినప్పటికీ విన్నర్ రేసులో అమర్, ప్రశాంత్ లకు గట్టి పోటీ ఇచ్చాడు శివాజీ. కనీసం రన్నర్ గా నిలుస్తారని ఆడియన్స్ అనుకున్నారు .. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు.
అయితే శివాజీ 15వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. కాగా బిగ్ బాస్ నిర్వాహకులతో శివాజీ భారీ మొత్తానికి ఒప్పందం చేసుకున్నాడట. తాజా సమాచారం ప్రకారం శివాజీ ఒక్క వారానికి రూ. 4. 25 లక్షలు తీసుకున్నాడని తెలిసింది. ఆయన రోజుకు 60 వేలకు ఛార్జ్ చేసాడట. అలా 15 వారాల పాటు హౌస్లో ఉన్న శివాజీ మొత్తంగా రూ. 63. 75 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలో హైయెస్ట్. ప్రైజ్ మనీ కంటే ఎక్కువగా ఆయన వసూలు చేశారు.