https://oktelugu.com/

Shivaji: ఏపీ ప్రజలకి ఇదేనా లాస్ట్ మెసేజ్.. చివరి నిమిషంలో సంచలన వీడియో రిలీజ్ చేసిన శివాజీ

ఏపీ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్కు ముస్లింలు అంటే ప్రేమ లేదని.. ఆయనకు కేవలం సంపాదన పై మాత్రమే ప్రేమ ఉందని హాట్ కామెంట్స్ చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 13, 2024 / 12:49 PM IST

    Shivaji

    Follow us on

    Shivaji: సినీ నటుడు శివాజీ సంచలన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొన్నటి వరకు పొలిటికల్ గా శివాజీ సైలెంట్ గా ఉండేవారు. కానీ ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ రాజకీయ విశ్లేషణలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ రాజకీయాలు, ఎన్నికలపై ఓ సర్వే సంస్థ రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. తనకు సీటు ఇవ్వలేదని కూటమికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి సర్వే ఇవ్వబోతున్నాడు. తప్పుడు సర్వేలతో ప్రజలను మార్చలేవు. నీవు ఏం చేసినా, 100 సర్వేలు ఇచ్చిన కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. సైలెంట్ గా ఉంటే ఉన్న పరువును కాపాడుకోవచ్చు. అంటూ శివాజీ ఈ వీడియోను విడుదల చేశారు.

    తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని చెబుతూనే శివాజీ.. ఏపీ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్కు ముస్లింలు అంటే ప్రేమ లేదని.. ఆయనకు కేవలం సంపాదన పై మాత్రమే ప్రేమ ఉందని హాట్ కామెంట్స్ చేశారు. మిస్బా అనే విద్యార్థిని ఎలా చంపారో తెలియదా? వైసిపి నేత కూతురు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని మిస్బాను ఆ స్కూల్ నుంచి పంపించి మానసిక క్షోభకు గురయ్యేలా చంపేశారని సంచలన ఆరోపణ చేశారు. నంద్యాలలో ఓ ముస్లిం కుటుంబం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకుంటే.. అప్పుడు ఏమయ్యావు సీఎం గారు అంటూ ప్రశ్నించారు. పిడుగురాళ్ల వద్ద ఇద్దరు ముస్లిం సోదరులను ఊరి నుంచి తరిమేస్తే.. వారిని నాపరాళ్లతో కాళ్లు విరగకొట్టినప్పుడు ఏమైపోయావు అంటూ నిలదీశారు.

    అయితే తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు శివాజీ. ఏపీలో జగన్ కు తప్ప.. ఎవరికైనా ఓటు వేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల నుంచి బలంగా భూములు లాక్కునేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని చెప్పుకొచ్చారు. అయితే కూటమి టిక్కెట్ ఆశించి దక్కకపోయిన వ్యక్తి.. కూటమికి వ్యతిరేకంగా సర్వే ఇస్తారని శివాజీ చెప్పడం సంచలనంగా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికైతే శివాజీ పోలింగ్కు ముందు ఈ సంచలన వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.